సైనిక్‌ స్కూల్‌పై రేవంత్‌ అబద్ధాలు: వినోద్‌ | Vinod comments on Revanth Reddy: telangana | Sakshi
Sakshi News home page

సైనిక్‌ స్కూల్‌పై రేవంత్‌ అబద్ధాలు: వినోద్‌

Jun 26 2024 5:31 AM | Updated on Jun 26 2024 5:31 AM

Vinod comments on Revanth Reddy: telangana

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పా టుపై సీఎం రేవంత్‌ రెడ్డి అసత్యాలు మాట్లా డుతున్నా రని బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బి.వినోద్‌ కుమార్‌ విమర్శించారు. ఇకపై ఆయన చెప్పే అబద్ధాలకు దీటుగా సమాధానం ఇస్తామ న్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి వినోద్‌ కుమార్‌ మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మా ట్లాడారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ త ర్వాత రేవంత్‌ గోబెల్స్‌ తరహాలో మాట్లాడార న్నారు.

వరంగల్‌లో సైనిక్‌ స్కూలు గతంలోనే మంజూరైందని, కానీ రక్షణశాఖ ఆధ్వర్యంలో నడపలే మని చెప్పినందునే సమస్య తలెత్తిందన్నారు. సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుపై గతంలో నాటి రక్షణ మంత్రులు మనోహర్‌ పారిక్కర్, అరుణ్‌ జైట్లీని అనేక మార్లు కలిశామని పేర్కొన్నారు. వరంగల్‌ సైనిక్‌ స్కూలు ఏర్పాటుపై గత ప్రభుత్వం కేంద్రంతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలను రేవంత్‌ చదువుకోవాలని సూచించారు. రక్షణ శాఖ భూముల కేటాయింపునకు సంబంధించి కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయని గుర్తు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement