స్మృతి ఇరానీకి మద్దతుగా రాహుల్‌ గాంధీ ట్వీట్‌! | Rahul Gandhi Argues Stop Use Derogatory language against Smriti Irani | Sakshi
Sakshi News home page

స్మృతి ఇరానీకి మద్దతుగా రాహుల్‌ గాంధీ ట్వీట్‌!

Jul 12 2024 3:32 PM | Updated on Jul 12 2024 4:07 PM

Rahul Gandhi Argues Stop Use Derogatory language against Smriti Irani

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ.. కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి మద్దతుగా ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచడం చర్చనీయాంశంగా మారింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ గాంధీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లోనూ వీళ్ల మధ్య పోటీ ఉండొచ్చని భావించినప్పటికీ.. అనూహ్యంగా రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీ చేశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ, రాహుల్‌ను ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్‌పై కామెంట్లు చేశారు. అయితే కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కిషోరీ లాల్‌ శర్మ, స్మృతి ఇరానీని ఓడించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. తాజాగా స్మృతి ఇరానీని దూషిస్తూ సోషల్‌ మీడియాలో కొందరు పోస్టులు చేస్తు‍న్న సంగతి రాహుల్‌ గాంధీ దృష్టికి వచ్చింది. దీంతో ఆమెకు మద్దతుగా ఆయన తన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.

జీవితంలో గెలుపోటములు వస్తుంటాయి. అలాగని ఒకరిని కించపర్చడం, అవమానించడం సరికాదు. పైగా అది బలహీనత అవుతుందే తప్ప.. బలం అనిపించుకోదు. స్మృతి ఇరానీనో లేదంటే ఇతర నాయకుల్ని అవమానించడం, దుర్భాషలాడడంలాంటివి చేయొద్దని కోరుతున్నా అని రాహుల్‌ తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement