
హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నట్లు ఉందని సెటైర్లు వేశారు. అందుకే వీలైనంత త్వరంగా జైలుకు పంపించాలని సీఎంను రెచ్చగొడుతున్నారన్నారు. కేటీఆర్, కవిత మధ్య పోటీ నెలకొంది. కవిత జైలుకు పోయివచ్చి బీపీ ఎజెండా ఎత్తుకుంది.
ఇప్పుడు నేను వెనుకబడ్డా అనుకుంటున్న కేటీఆర్.. జైలుకు పోయి పథకం రచించాలనుకుంటున్నారు. ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలనుకుంటున్నాడు’ అని మంత్రి సీతక్క విమర్శించారు.
ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సీతక్క మాట్లాడుతూ.. నేటి సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే తాను అన్నానని, కానీ ఎన్నికల డేట్ చెప్పినట్లు మీడియాలో ప్రచారం జరిగిందని, అది అవాస్తవమన్నారు.
