రేవంత్‌ సీఎం అవుతారని పదేళ్ల క్రితమే చెప్పా..  | Malla Reddy Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ సీఎం అవుతారని పదేళ్ల క్రితమే చెప్పా.. 

Mar 17 2024 6:07 AM | Updated on Mar 17 2024 6:07 AM

Malla Reddy Comments On Revanth Reddy - Sakshi

నాటి విషయాలు గుర్తుచేసుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి  

కంటోన్మెంట్‌: రేవంత్‌రెడ్డి సీఎం అవుతాడని తాను పదేళ్ల క్రితమే జోస్యం చెప్పానని మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. 2014 సెపె్టంబర్‌లో మల్లారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కంటోన్మెంట్‌ పరిధిలో జరిగిన ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో రేవంత్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదా సంభాషణల్లో భాగంగా మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ... ‘అన్నా నువ్వు సీఎం అవుతావు అన్నా.. ఆ చాన్స్‌ నీ ఒక్కడికే ఉంది రెడ్డిలల్ల..’అన్నారు. అప్పట్లో తీన్మార్‌ వార్తల్లో ప్రసారం అయిన ఈ వీడియా తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శనివారం మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వీడియోను చూపుతూ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తనకు రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో తామిద్దరం కలిసి ప్రచారం చేసిన ఫొటోలను సైతం చూపించారు. తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. తాను మాత్రం బీఆర్‌ఎస్‌ను వీడేది లేదంటూ స్పష్టం చేశారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, మేడ్చల్‌ నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నానని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement