Sakshi News home page

నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Tue, Apr 16 2024 12:55 AM

సూచనలిస్తున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ - Sakshi

కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్నందున ఆ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై ఏసీపీ గజ్జి కృష్ణ, పోలీసు అధికారులతో కలిసి సోమవారం కలెక్టర్‌ ఏర్పాట్లు పరిశీలించారు. రోజూ ఉదయం 11.00 – మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఆ సమయంలో పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారి చాబర్‌ నుంచి 100మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహించాలని సూచించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణ్‌రావు, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పకడ్బందీగా నామినేషన్ల ప్రకియ..

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ ఆదేశించారు. అడిషనల్‌ కలెక్టర్లు శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, అరుణశ్రీతో కలిసి నామినేషన్ల స్వీకరణ సమయంలో పాటించాల్సిన పద్ధతులపై కలెక్టర్‌ సమీక్షించారు. నామినేషన్‌తో పాటు పరిశీలించాల్సిన పత్రాలు, అభ్యర్థులకు అందించాల్సిన సూచనలు, ఎన్నికల మార్గదర్శకాలు తదితర అంశాలను ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు వివరించారు. సమావేశంలో తహసీల్దార్లు, ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌, ఈడీఎం కవిత పాల్గొన్నారు.

మాదిగలకు అన్యాయం చేసిన రాజకీయ పార్టీలు

గోదావరిఖని: పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో మాదిగలకు అన్యాయం చేసిన రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గంపై తమ వైఖరిని వెల్లడించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌మాదిగ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు మాదిగలకు టికెట్‌ కేటాయించకుండా అన్యాయం చేశాయని విమర్శించారు. ముగ్గురు అభ్యర్థులు మాదిగ సామాజిక వర్గానికి ఏం చేస్తారో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్లకు చైర్మన్లను ఎప్పుడు నియమిస్తారో తెలుపాలన్నారు. ఈనెల 21న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మాదిగ దండోరా జిల్లా కన్వీనర్‌గా కండె కుమారస్వామిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. నాయకులు వడ్లూరి శ్రీనివాస్‌, కండె కుమారస్వామి, కడారి రమేశ్‌, వడ్లకొండ సంజయ్‌, సమ్మయ్య, రాజు, బాబన్న, రాంబాబు, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

‘జువ్వాడి’ సేవలు మరువలేనివి

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

తిమ్మాపూర్‌: స్వాతంత్య్ర సమరయోధుడు జువ్వాడి మధుసూదన్‌రావు సేవలు మరువలేనివని, క రీంనగర్‌ జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు చైర్మన్‌ చాడ వెంకట్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ ఎంపీ వి నోద్‌కుమార్‌ అన్నారు. మధుసూదనరావు కుటుంబ సభ్యులు మానసి క వికలాంగుల సంస్థలో సోమవారం సంతాపసభ నిర్వహించారు. మానసిక వికలాంగ విద్యార్థులకు భోజనం అందించారు. సభకు చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. మధుసూదన్‌రావు 36 ఏళ్ల క్రితం సంస్థ స్థాపించి మేనేజింగ్‌ ట్రస్టీగా అమోఘమైన సేవలందించారన్నారు. కొన్నేళ్లుగా సంస్థ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్న క్రమంలోనే పరమపదించడం బాధాకరమన్నారు. అంతకు ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్రస్టీ సముద్రాల జ నార్దన్‌రావు మాట్లాడుతూ.. మధుసూధన్‌రావు ధైర్యశాలీ అని కుటుంబ సభ్యులు వారితోపాటు వచ్చి అమెరికాలో నివాసముండాలని కోరినా తిరస్కరించి ప్రా ణముండే వరకు భారత దేశంలోనే నివసిస్తానని అనేవారన్నారు. ఆయన కూతు ర్లు జువ్వాడి శైలజ, జువ్వాడి పద్మజ, పొట్లపల్లి గోవిందరావు, సత్యనారాయణ, బంధువు కమలాకర్‌రావు మాట్లాడుతూ అమెరికాలో సంస్థకు విరాళాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు. మేనేజింగ్‌ ట్రస్టీ బొజ్జపురి వెంకటయ్య, ట్రస్టీలు కోమిరెల్లారెడ్డి, గాజుల భగవాన్‌, జాప వెంకట రమణారెడ్డి, సీపీఐ నేత మర్రి వెంకటస్వామి, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి బాల్‌రాజు, ప్రిన్సిపాల్‌ సతీశ్‌ ఉన్నారు.

Advertisement
Advertisement