పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు

Published Sat, Apr 20 2024 1:20 AM

-

పెద్దపల్లిరూరల్‌: ప్రవేశ పరీక్ష రాయకున్నా దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ మహిళా టెక్నికల్‌ శిక్షణ సంస్థలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందేందుకు ఆసక్తి గల అనాథ, నిరుపేద బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రవుఫ్‌ఖాన్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ పాలిటెక్నిక్‌లో ప్రవేశం పొందేందుకు టెన్త్‌ పూర్తయి, ఉండి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ, పాక్షిక అనాథ, నిరుపేద బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మూడు సంవత్సరాల కాలపరిమితి గల డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌, ఈసీఈ, ఈఈఈ, డిప్లొమా ఇన్‌ కంప్యూటర్స్‌ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపికై న బాలికలకు ఉచిత విద్య, వసతి కల్పిస్తారని పేర్కొన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 18వ తేదీలోగా బాలరక్ష భవన్‌ కార్యాలయంలో అందించాలని కోరారు. పూర్తివివరాలకు సెల్‌ నంబరు 90324 27241లో సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement