Sakshi News home page

అభివృద్ధి పేరిట విధ్వంసం తగదు

Published Thu, Mar 28 2024 12:10 AM

సంఘీభావం తెలుపుత్నున కార్మిక నేతలు - Sakshi

● సింగరేణి క్వార్టర్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోం ● కార్మిక సంఘాల నాయకుల హెచ్చరిక

గోదావరిఖని: రామగుండం అభివృద్ధి పేరిట సామాజిక విధ్వంసం సృష్టిస్తున్నారని, సింగరేణి క్వార్టర్ల కూల్చివేతను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సింగరేణి కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గోదావరిఖనిలో పదిరోజులుగా పాలకులు, అధికార యంత్రాంగం, సింగరేణి యాజమాన్యం రోడ్ల విస్తరణ పేరిట సామాజిక విధ్వంసానికి పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. 72క్వార్టర్ల తొలగింపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. రామగుండం ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో కాంగ్రెస్‌ నాయకులను ఉసిగొల్పుతూ కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌, రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు తుమ్మల రాజారెడ్డి, జక్కుల నారాయణ, ఆకుల హరీణ్‌, కృష్ణ, నరేశ్‌, తోట వేణు, నంబయ్య, రామస్వామి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement