No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, May 26 2024 5:10 AM

-

విజయనగరం అర్బన్‌: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 2021 – 24 బ్యాచ్‌ డిగ్రీ తుది పరీక్షల (ఆరో సెమిస్టర్‌) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. పట్టణంలోని ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పలు సబ్జెక్ట్‌లలో మొదటి మూడు స్థానాలు సాధించారు. బీసీఏ గ్రూప్‌లో దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామానికి చెందిన కన్నా జోస్యుల అపూర్వ 9.25 సీజీపీఎస్‌ పాయింట్లు, పట్టణంలోని కామాక్షినగర్‌కు చెందిన కట్లమూడి భవ్యతేజ 9.24 తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బీఎస్సీ (సీబీసీఎస్‌)లో మెరకముడిదాం మండలం బిల్లలవలసకు చెందిన ఆరవెల్లి ఆశ్రితరాం 9.60, డెంకాడ మండలం చింతలవలస చెందిన శంకుసాయి ప్రవళ్లిక 9.56 సీజీపీఎస్‌ పాయింట్స్‌లో జిల్లా స్థాయిలో రెండు, మూడు స్థానాలు సాధించారు. బీకాం (జనరల్‌) విభాగంలో పట్టాణానికి చెందిన మంచుకొండ అలివేలు మంగతాయారు 9.31 సీజీపీఏ పాయింట్స్‌, విసినిగిరి గీతాంజలి 9.19, మోతమర్రి అనూష 8.85 పాయింట్లతో వరుసగా మొదటి, రెండు, మూడు ర్యాంకులు సాధించారు. బీబీఏలో పట్టణానికి చెందిన బగ్గాం లిఖిత 8.68, కెళ్ల తరుణిసాయిశ్రీ 8.64 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పట్టణానికి చెందిన నేపాడ హిమాని 8.65, సారిక నయోమి 8.62, రాజాం మండలానికి చెందిన కోడూరు వెన్నెల 8.50 పాయింట్లతో మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు.

జిల్లా టాపర్‌ హారిక..

బొబ్బిలి: బీఎస్సీ మ్యాథ్స్‌, స్టాటస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పొట్నూరు హారిక 9.7 పాయింట్లతో జిల్లా టాపర్‌గా నిలిచింది. దీంతో హారికను రాజా కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ చల్లా వీరంద్రకుమార్‌, అభినందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement