జిల్లాలో 13.42 మి.మీ. వర్షపాతం | Sakshi
Sakshi News home page

జిల్లాలో 13.42 మి.మీ. వర్షపాతం

Published Sun, May 26 2024 6:50 AM

జిల్లాలో 13.42 మి.మీ. వర్షపాతం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఎన్టీఆర్‌ జిల్లాలో పలు చోట్ల శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. విజయవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరపి లేకుండా వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ఏలూరు రోడ్డులోని చుట్ట్టుగుంట, బెంజ్‌ సర్కిల్‌, భవానీపురం ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. రోహిణీ కార్తె తీవ్రమైన ఎండలు ఉంటాయని నగర ప్రజలు భావించారు. తుపాను ప్రభావంతో చల్లని వాతావరణం ఏర్పడింది. జిల్లాలో వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, చందర్లపాడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది. 13.42 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడ సెంట్రల్‌, విజయవాడ వెస్ట్‌ మండలాల్లో 34.6 మిల్లీమీటర్లు, నార్త్‌ మండలంలో 34.2, తూర్పు మండ లంలో 34, విజయవాడ రూరల్‌లో 32.8 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. మైలవరం మండలంలో 24.2 మిల్లీమీటర్లు, విస్సన్నపేటలో 15.2, జి.కొండూరులో 14.2, ఎ.కొండూరులో 14.0, రెడ్డిగూడెంలో 10.4, ఇబ్రహీంపట్నంలో 8.4, తిరువూరులో 2.8, వీరులపాడులో 2.8 మిల్లీమీటర్లు, గంపలగూడెంలో 2.4, కంచికచర్లలో 2.4, నందిగామలో 1.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement