అక్రమ మద్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం పట్టివేత

Published Sun, May 26 2024 6:45 AM

అక్రమ మద్యం పట్టివేత

లబ్బీపేట(విజయవాడతూర్పు): హర్యానా రాష్ట్రం నుంచి అక్రమంగా తీసుకు వచ్చిన 64 ఫుల్‌ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కేవీఆర్‌కే ప్రసాద్‌ తెలిపారు. నగరంలోని భానునగర్‌ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో అక్రమ మద్యం సమాచారం రాగా, తమ సిబ్బంది వెళ్లి తనిఖీలు చేశారన్నారు. ఆ తనిఖీల్లో హర్యానా నుంచి తీసుకు వచ్చిన 64 సీసాలు స్వాధీనం చేసుకుని, నిందితులు కుంచాడ మోహనరావు, మహంకాళి మురళిను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో వెస్ట్‌ ఎస్‌ఈబీ స్టేషన్‌ సీఐ ఎస్‌.శ్రీనివాసరెడ్డి, ఎం.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement