No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, May 24 2024 9:15 AM

No Headline

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తొలి విడత ర్యాండమైజేషన్‌ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ చాంబర్‌లో జూన్‌ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపులో పాల్గొనే కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ర్యాండమైజేషన్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ఢిల్లీరావు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు 403 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 504 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 364 మంది మైక్రో అబ్జర్వర్లు మొత్తంగా 1271 మంది కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ను ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో పూర్తిచేశామని వివరించారు. జేసీ పి. సంపత్‌ కుమార్‌, డీఆర్వో వి. శ్రీనివాసరావు, ఎన్‌ఐసీ డీఐఓ రేవతి, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ ఎం. దుర్గా ప్రసాద్‌ పాల్గొన్నారు.

అమరేశ్వరుని సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

అమరావతి: అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరుడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి రవికుమార్‌ గురువారం దర్శించుకున్నారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవికుమార్‌ దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి శేషవస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement