రైతులకు సరైన సలహాలు ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

రైతులకు సరైన సలహాలు ఇవ్వాలి

Published Sun, May 26 2024 8:00 AM

రైతులకు సరైన సలహాలు ఇవ్వాలి

డిచ్‌పల్లి : శిక్షణలో నేర్చుకున్న అంశాలను చక్కగా అర్థం చేసుకుని పంటల సాగులో రైతులకు సరైన సలహాలు ఇవ్వాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నిజామాబాద్‌ పథక సంచాలకులు (పీడీ) ఆర్‌ తిరుమల ప్రసాద్‌ సూచించారు. ఆత్మ ఆధ్వర్యంలో శనివారం డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్‌ రైతు వేదిక లో ‘డిప్లమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీసెస్‌ ఫర్‌ ఇన్‌పుట్‌ డీలర్స్‌ (డీఏఈఎస్‌ఐ)’ 2023–24 బ్యాచ్‌ –2 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పీడీ మాట్లాడుతూ.. ఈ కోర్సుతో డీలర్లకు వ్యవసాయంలో మెళకువలు, పంటల సాగులో నూతన పద్ధతులు తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం శిక్షణ సంబంధిత పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆత్మ అధికారులు, ఇన్‌ఫుట్‌ డీలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement