ఎన్‌సీసీ జాతీయ శిబిరంలో రాంపూర్‌ విద్యార్థులు | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ జాతీయ శిబిరంలో రాంపూర్‌ విద్యార్థులు

Published Sun, May 26 2024 8:00 AM

ఎన్‌స

డిచ్‌పల్లి : మేడ్చల్‌ సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఈ నెల 14 నుంచి 25వరకు జరిగిన ‘ఏక్‌ భారత్‌ – శ్రేష్ట్‌ భారత్‌’ ఎన్‌సీసీ కేడెట్ల జాతీయ స్థాయి శిబిరంలో డిచ్‌పల్లి మండలం రాంపూర్‌ గ్రామ ఉన్నత పాఠశాల కేడెట్లు (విద్యార్థులు) ఏ భావన, పి వైష్ణవి పాల్గొన్నారు. ఈ శిబిరంలో తెలంగాణ తో పాటు గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నట్లు ఎన్‌సీసీ అధికారి శ్రీనివాస్‌ ఖత్రి తెలిపారు.

అడ్మిషన్ల కోసం అధ్యాపకుల ప్రచారం

ధర్పల్లి : మండలంలోని దుబ్బాక, చల్లగరిగే గ్రామాల్లో ధర్పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాల కోసం అధ్యాపకులు శనివారం ప్రచారం చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కలిసి ప్రవేశాలు పొందాల్సిందిగా కోరారు. ప్రభుత్వ కళాశాలలో ఉన్న సౌకర్యాలను విద్య బోధన గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ బైపీసీ, సీఈసీ కోర్సులు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో సీట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్‌ రాజీయోద్దీన్‌ తెలిపారు.

ఫేక్‌ డాక్యుమెంట్స్‌పై

విచారణ జరపాలి

నిజామాబాద్‌ అర్బన్‌ : నగరంలోని శ్రీచైతన్య, నా రాయణ విద్యాసంస్థలు నకిలీ డాక్యుమెంట్లతో అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పీడీఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఆ సంస్థలు విద్యాశాఖకి ఇచ్చిన ఫీజుల వివరాల కంటే అధికంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. నాయకులు వంశీ, సునీల్‌, ఉదయ్‌, శశాంక్‌, రాజు, గోపి, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఆర్‌హెచ్‌ గెలవాలని పూజలు

ఇందల్వాయి : ఐపీఎల్‌లో ఫైనల్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు విజేతగా నిలవాలని ఇందల్వాయి గ్రామానికి చెందిన పలువురు యువకులు రామాలయంలో శనివారం పూజలు చేశారు. అభిమానులు లోకాని గోపి, అశోక్‌, విశాల్‌, సందీప్‌, బబ్లూ, అరుణ్‌, అర్వింద్‌, అనిల్‌, శ్రీకాంత్‌ ఉన్నారు.

ఎన్‌సీసీ జాతీయ శిబిరంలో  రాంపూర్‌ విద్యార్థులు
1/2

ఎన్‌సీసీ జాతీయ శిబిరంలో రాంపూర్‌ విద్యార్థులు

ఎన్‌సీసీ జాతీయ శిబిరంలో  రాంపూర్‌ విద్యార్థులు
2/2

ఎన్‌సీసీ జాతీయ శిబిరంలో రాంపూర్‌ విద్యార్థులు

Advertisement
 
Advertisement
 
Advertisement