ఆగని ఆగడాలు! | Sakshi
Sakshi News home page

ఆగని ఆగడాలు!

Published Sun, May 26 2024 7:50 AM

ఆగని

నిజామాబాద్‌

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసా గుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ముగ్గురు డిబార్‌ అయ్యారు.

ఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024

– 8లో u

తాను కేసీఆర్‌ దత్తపుత్రుడినంటూ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టం వచ్చినట్లు పేట్రేగిపోయిన ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వ్యవహారం నిరంతరం వివాదాలమయంగా నడిచింది. అయితే అధికారం కోల్పోయిన తరువాత సైతం జీవన్‌రెడ్డి ఈ దౌర్జన్యాలను, బెదిరింపుల పర్వాన్ని మాత్రం వదలడం లేదు. ప్రజాప్రతినిధిగా ఉండి పూర్తి ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించిన జీవన్‌రెడ్డి తీరుపై ప్రభుత్వం ఇప్పటికై నా సీరియస్‌గా స్పందించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై తాజాగా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చేవెళ్ల సమీపంలోని ఎర్రపల్లి వద్ద దామోదర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన 20 ఎకరాల 20 గుంటల భూమిని కబ్జా చేసి, పైగా ఆయనపై పంజాబ్‌ గ్యాంగ్‌తో మారణాయుధాలతో దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

● జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూనే అనేక అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఈ అరాచకాలు కళ్లముందే కనిపిస్తున్నప్పటికీ ప్రజలు ఏమీ చేయలేక, ప్రశ్నించలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి అక్రమ, అరాచక వ్యవహారాలపై ‘సాక్షి’ అనేక కథనాలను ప్రచురించింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇతర పార్టీలతో పాటు బీఆర్‌ఎస్‌లోనే ఉన్న దాదాపు స్థానిక ప్రజాప్రతినిధులందరినీ ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ, బెదిరింపులకు గురి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ విషయాలపై ‘సాక్షి’ కథనాలను ప్రచురించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరించిన, దౌర్జన్యాలకు సంబంధించి, భూకబ్జాలు, అక్రమ మొరం తవ్వకాలు తదితరాలపై వరుస కథనాలను ‘సాక్షి’ ప్రచురించింది. లక్కంపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఏర్పాటు చేసిన సెజ్‌లో పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకుని, ఆ సెజ్‌లోని 429 ఎకరాల భూమిలో 200 ఎకరాలు ఆక్రమించి వెంచర్‌ వేసేందుకు జీవన్‌రెడ్డి చేసిన కుట్రను సైతం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.

అదేవిధంగా జీవన్‌రెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలపై నెలల తరబడి తల్వెద గ్రామస్తులు చేసిన పోరాటం గురించి కథనాలు ఇవ్వడం జరిగింది. కథనాలు రాసిన పాత్రికేయులపైనా జీవన్‌రెడ్డి అనుచరులు దాడులు, హత్యాప్రయత్నాలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇక కల్లెడ సర్పంచ్‌ లావణ్య, ఆమె భర్త ప్రసాద్‌గౌడ్‌పై నాటకీయంగా హత్యాయత్నం కేసులు పెట్టించాడు. మరోవైపు స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై సైతం ఆలూరు వద్ద దాడి, హత్యాయత్నం చేయించాడు. ఇంత అరాచకంగా, అనైతికంగా వ్యవహరించాడని జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు బ్యానర్లు కట్టారు. ఇలా వచ్చిన ప్రజావ్యతిరేకతతో జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో మూడోస్థానంతో చిత్తుగా ఓడిపోయాడు. కాగా ఇప్పటికీ మారని జీవన్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌పై బెదిరింపు ప్రకటనలు ఇవ్వడం, చేవెళ్లలో దామోదర్‌రెడ్డి భూమిని కబ్జా చేసి పంజాబ్‌ ముఠాతో మారణాయుధాలతో దాడులు చేయించిన విషయమై తక్షణమే ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

న్యూస్‌రీల్‌

వివాదాలమయం..

మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి వ్యవహారం

అధికారంలో ఉన్నప్పుడూ..

కోల్పోయాకా అవే దందాలు

గతంలోనూ.. ఇప్పుడూ దాడులకు

ప్రోత్సాహం

అడుగడుగునా దౌర్జన్యాలు..

బెదిరింపులు

ఇప్పటికీ అదే వైఖరి..

ప్రభుత్వం సీరియస్‌గా

వ్యవహరించాలంటున్న జనం

ఆర్మూర్‌ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కింద జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌ నిర్మించాడు. దీని అద్దె బకాయి లు చెల్లించకపోవడంతో టీజీఎస్‌ఆర్టీసీ అధికారు లు స్వాధీనం చేసుకునేందుకు నోటీసులిచ్చి సీజ్‌ చేశారు. హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్న జీవన్‌రెడ్డి శుక్రవారం మాల్‌ను తిరిగి తెరిచారు. అయితే హైకోర్టు వారంరోజుల గడు వు మాత్రమే ఇచ్చింది. వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే ఎలాంటి నోటీసులు లేకుండానే మాల్‌ను స్వాధీనం చేసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. ప్రస్తుతం సబ్‌ లీజుదారుల ప్రయోజనాల దృష్ట్యా కోర్టు ఉత్తర్వుల మేరకు మాల్‌ను తెరిచేందుకు వారం రోజులు గడువు ఇచ్చినట్లు ప్రకటనలో సజ్జనార్‌ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో అద్దె బకాయిల కు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చిన సందర్భంలో వారిని పలుసార్లు జీవన్‌రెడ్డి బెదిరింపులకు గురిచేయడం గమనార్హం.

ఆగని ఆగడాలు!
1/2

ఆగని ఆగడాలు!

ఆగని ఆగడాలు!
2/2

ఆగని ఆగడాలు!

Advertisement
 
Advertisement
 
Advertisement