Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

Published Tue, Apr 16 2024 1:10 AM

ఆర్మూర్‌లో మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న అగ్నిమాపక సిబ్బంది  - Sakshi

బోధన్‌టౌన్‌(బోధన్‌): అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్నిమాపక కేంద్రం అధికారి గంగాదాస్‌ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని ఆర్టీసీ డిపో, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లలో అ వగాహన సదస్సులు నిర్వహించారు. ఆర్టీసీ డిపో లోని ఉద్యోగులకు, ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు, రైల్వే స్టేషన్‌లో సిబ్బందికి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జ రిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి వివ రించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశా రు. సిబ్బంది శ్రీనివాస్‌, నర్సయ్య, వారిస్‌ అహ్మద్‌, రషీద్‌, సాయిలు, రాజశేఖర్‌, మోసిన్‌ ఖాన్‌ ఉన్నారు.

ఆర్మూర్‌ పట్టణంలో..

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పట్టణంతో పాటు పెర్కిట్‌ చౌరస్తా వద్ద జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా ఆస్పత్రులు, బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాల వద్ద మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. అగ్నిప్రదామాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.

నందిపేటలో..

నందిపేట్‌(ఆర్మూర్‌): మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంగణంలో వివేకానంద చౌరస్తా వద్ద సోమవారం అగ్నిమాపక సిబ్బంది తమ సేవలను వివరిస్తూ ప్రదర్శనలు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు. కార్యక్రమంలో నందిపేట ఫైర్‌స్టేషన్‌ ఫైర్‌మెన్లు మధుకర్‌, సుధాకర్‌, సూరజ్‌, డ్రైవర్‌ ఎండీ షఫీ, హోంగార్డు పి.రఘు, తదితరులు పాల్గొన్నారు.

బాల్కొండలో..

బాల్కొండ: మండల కేంద్రంలో స్థానిక ఫైర్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో అగ్ని మాపక వారోత్సవాలు రెండో రోజు సోమవారం కొనసాగాయి. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ శేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement