Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Apr 16 2024 1:05 AM

-

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): డిచ్‌పల్లిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వ ర్యంలో ఉచిత శిక్షణకు మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్‌ సుంకం శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 17 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. బ్యూటీపార్లర్‌, మగ్గంవర్క్‌, టైలరింగ్‌ (30 రోజులు) కోర్సుల్లో శిక్షణనిస్తారని వివరించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల గ్రామీణ ప్రాంత యువతులు (19 నుంచి 45 ఏళ్ల వయస్సు) శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్‌, రేషన్‌కార్డు, ఎస్సెస్సీ మెమో, 5 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు వెంట తీసుకునివచ్చి ఆర్‌ఎస్‌ఈటీఐలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ధ్రువీకరణపత్రం, టూల్‌ కిట్‌ అందజేస్తామని, ఈ అవకాశాన్ని ఆసక్తి, అర్హత గల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్‌ కోరారు. పూర్తి వివరాలకు 08461 295428 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఫీజు కట్టలేదని పరీక్షకు అనుమతి నిరాకరణ

నిజామాబాద్‌అర్బన్‌: ఫీజు చెల్లించలేదని ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను సమ్మెటీవ్‌–2 పరీక్షకు సోమవారం అనుమతించలేదు. నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న అక్రిడ్జ్‌ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఫీజు చెల్లించలేదు. తల్లిదండ్రులు వచ్చి బతిమాలినప్పటికీ వినకపోవడంతో విద్యార్థులు పరీక్షరాయకుండానే వెనుదిరిగారు. ఈ విషయమై తల్లిదండ్రులు డీఈవోకు ఫిర్యాదు చేశారు. అలాగే నగరంలోని షైన్‌ స్టార్‌ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు. దీంతో వారి తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా చివరి క్షణంలో పరీక్షకు అనుమతించారు. విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన ప్రైవేట్‌పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.

న్యాయం చేయాలని వినతి

కామారెడ్డి అర్బన్‌: కొందరు పెద్దమనుషులు తనపై కక్షగట్టి చేపలు వేటాడకుండా సొసైటీ నుంచి బహిష్కరించారని నిజాంసాగర్‌ మండలం మల్లూర్‌కు చెందిన మత్స్యకారుడు పొట్టినాగి బాల్‌రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్‌, మత్స్యశాఖ అధికారికి విజ్ఞప్తి చేశాడు. మల్లూర్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో తనకు సభ్యత్వం ఉందని, సయ్యని మైసయ్య, గిర్ని అంజయ్య, గులింగి దుర్గయ్య తనపై కక్షతో సొసైటీలో వాటా ఇవ్వకుండా బహిష్కరించినట్లు తెలిపాడు. చేపల చెరువును ఇతరులకు గుత్తాకు ఇచ్చారని బాల్‌రాజ్‌ ఆరో పించాడు. తన తల్లి వికలాంగురాలు కాగా తండ్రి చనిపోయాడని, తన పరిస్థితి బాగోలేదని, తనకు న్యాయం చేయాలని విన్నవించాడు.

ట్రేడ్‌ టెస్ట్‌కు అవకాశం

నిజామాబాద్‌అర్బన్‌: ఐటీఐకి సంబంధించి ఏదైనా ట్రేడ్లలో అనుభవం ఉన్న వారు సంబంధిత ట్రేడ్‌ పరీక్షలకు(ఏఐటీటీ) హాజరయ్యే అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్‌ కోటిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఐటీఐలో ఏదైనా ట్రేడ్‌కు సంబంధించిన ప్రైవేట్‌ లేదా గవర్నమెంట్‌ సంస్థల్లో మూడు సంవత్సరాల అనుభవం ఉండి.. సంబంధిత ట్రేడ్లలో సర్టిఫికెట్‌ పొందేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీలోగా వరంగల్‌లోని రీజినల్‌ డిప్యూ టీ డైరెక్టర్‌ కార్యాలయానికి నేరుగా వెళ్లి దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉత్తీర్ణత అవకాశాన్ని బట్టి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94417 84849 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement