పాఠశాలలో సమస్యల తిష్ట | Sakshi
Sakshi News home page

పాఠశాలలో సమస్యల తిష్ట

Published Sat, Dec 2 2023 1:00 AM

- - Sakshi

నిజామాబాద్‌రూరల్‌: పాఠశాలలో కనీస సౌకర్యా లు లేక ఇబ్బందులు పడుతున్నారు. రూరల్‌ మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలల్లో తాగునీరు, డ్రెయినేజీ లేదు. 300 మంది విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయుల కు ఒకే మూత్రశాల ఉంది. అదే విధంగా పాఠశాల భవనం పురాతనమైనది కావడంతో తరగతి గదు ల్లో ఉన్న స్లాబ్‌ పెచ్చులు ఎప్పుడు కిందపడిపోతా యో తెలియని పరిస్థితి ఉంది. అదే విధంగా తాగునీటి ట్యాంక్‌ వద్ద అపరిశుభ్రంగా నెలకొంది. గతంలో మన ఊరు–మన బడి కార్యక్రమం కింద పాఠశాలలో మూత్రశాలలు నిర్మించేందుకు చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా పాఠశాల ఆవరణలో ఉన్న పల్లెప్రకృతి వనం చె ట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఉ పాధ్యాయులు పేర్కొన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ లేక మురుగు నీరు పాఠశాలలోనే నిలుస్తోంది. అధికారులు స్పందించి పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, గ్రామస్తులు కోరుతున్నారు.

తిర్మన్‌పల్లి పాఠశాల

300 మంది విద్యార్థులకు

ఒకే మూత్రశాల

బడి ఆవరణలోనే

మురుగు నీరు నిల్వ

తిర్మన్‌పల్లి పాఠశాలలో

విద్యార్థుల ఇబ్బందులు

పట్టించుకోని అధికారులు

పాఠశాలలో ఉన్న ఒక మూత్రశాల
1/2

పాఠశాలలో ఉన్న ఒక మూత్రశాల

పాఠశాలలో నిలిచిన మురుగు నీరు
2/2

పాఠశాలలో నిలిచిన మురుగు నీరు

Advertisement
Advertisement