రాష్ట్రస్థాయి నృత్యోత్సవంలో ప్రతిభ | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి నృత్యోత్సవంలో ప్రతిభ

Published Sat, Dec 2 2023 1:00 AM

- - Sakshi

నిజామాబాద్‌ సిటీ: బెంగళూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్యోత్సవంలో నిజామాబాద్‌ విజయ్‌ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా కార్తీక దామోదరుడికి సమర్పించిన నృత్యనీరాజన కార్యక్రమం రవీంద్ర కళాక్షేత్రంలో వివిధ జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ పాఠశాలకు చెందిన జి వైభవికృతి, సీహెచ్‌ సాన్వి పాల్గొని ప్రదర్శన ఇచ్చారు. విజయ్‌ హైస్కూల్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ అమృతలత, కరస్పాండెంట్‌ వి ప్రభాదేవి విద్యార్థినులను అభినందించారు.

పోలీస్‌ కిష్టయ్యకు నివాళి

ఇందల్వాయి: తెలంగాణ అమరవీరుడు పోలీస్‌ కిష్టయ్య వర్ధంతిని ఇందల్వాయి మండల ముదిరాజ్‌ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. లింగాపూర్‌ స్టేజ్‌ వద్ద ఉన్న కిష్టయ్య విగ్రహానికి ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇమ్మడి గోపి పూలమాల వేసి ని వాళులు అర్పించారు. ముదిరాజ్‌లు ఐక్యతతో రాజకీయ సాధికారత సాధించాలని అన్నారు.

సాటాపూర్‌ గేట్‌ వద్ద..

ఎడపల్లి: మండలంలోని సాటాపూర్‌ గేట్‌ వద్ద శుక్రవారం తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్య ముదిరాజ్‌ వర్ధంతిని ఘనంగా ని ర్వహించారు. కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముదిరాజ్‌ సంఘం మండలాధ్యక్షుడు పిస్క గంగాప్రసాద్‌ మాట్లాడు తూ కిష్టయ్య త్యాగం ఉద్యమానికి ఊపిరి అయ్యిందని పేర్కొన్నారు. ముదిరాజ్‌ మహసభ నాయకులు ఆంజనేయులు, సున్నపు ఒడ్డెన్న, రాజ్‌కుమా ర్‌, మనోజ్‌, రవి, గంగాధర్‌, మల్లేశం, నెల్లి రాజు, రామ్‌చందర్‌, కృష్ణ, భాస్కర్‌, పిట్ల పోచయ్య, అబ్బులు, నర్సింలు, స్వామి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన నాయకులు

మోపాల్‌: మండలంలోని కంజర్‌ గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు ఇలేందర్‌ శుక్రవారం రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇలేందర్‌కు కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. ఈసందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ పార్టీ కోసం నెల రోజుల పాటు శ్రమించిన ప్రతి కార్యకర్త, నాయకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్‌కు ఓటేసిన ఓటర్లకు భూపతిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు గుడి ప్రవీణ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాకేష్‌, నారాయణరెడ్డి, ఖలీమ్‌, చిన్నారెడ్డి, భాస్కర్‌ పాల్గొన్నారు.

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

సిరికొండ: మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్‌ ఆఫీసర్‌ అరవింద్‌, సీహెచ్‌వో అనంతరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పడగల్‌లో సీఎస్‌ఐ

చర్చి వార్షికోత్సవం

వేల్పూర్‌: వేల్పూర్‌ మండలం పడగల్‌లోని సీఎస్‌ఐ చర్చి నాలుగో వార్షికోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. వార్షికోత్సవ ప్రార్థనల కోసం చర్చిని అందంగా ముస్తాబు చేశారు. చిన్నారులు, పురుషులు, మహిళలు ప్రత్యేక గీతాలు ఆలపించారు. పాస్టర్‌ రెవరెండ్‌ ప్రేమ్‌రాజ్‌ దైవసందేశం వినిపించారు. సంఘ పెద్దలు టి సందీప్‌, జే దయానంద్‌, జి వసంత్‌, సీ్త్రల మైత్రి సభ్యులు తబిత ప్రేమ్‌రాజ్‌, ప్రభావతి, అమూల్య, వర్ష, లావణ్య, లలిత, స్రవంతి, అఖిల తదితరులు పాల్గొన్నారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement