అంగన్‌వాడీల ప్రక్షాళన | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల ప్రక్షాళన

Published Mon, May 27 2024 12:35 AM

అంగన్

నిర్మల్‌
● టీచర్లు, ఆయాలకు వయో పరిమితి ● 65 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్‌ ● జూన్‌ నుంచి అమలుకు కసరత్తు ● జిల్లాలో ఖాళీ కానున్న 123 పోస్టులు ● కొత్త వారిని నియమించే అవకాశం

రైతులూ జాగ్రత్త..!

మరికొద్ది రోజుల్లో ఖరీఫ్‌ సాగు ప్రారంభం కానుంది. విత్తనాల కొనుగోళ్లలో రైతులు జా గ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

8లోu

సోమవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2024

‘బీడీ కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయాలి’

ఖానాపూర్‌: బీడీ కార్మికులకు పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సునారికారి రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన ఒప్పందం ఏప్రిల్‌ 30తో ముగిసిందన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం తమ యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్‌ నోటీస్‌ ఇవ్వగా ప్రభుత్వం ఈ నెల 25న బీడీ యాజమాన్య సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. ఈ చర్చల్లో బీడీ ప్యాకర్లకు నెలకు రూ.3,650, నెలసరి ఉద్యోగులకు రూ.1,700 చొప్పున వేతనాలు పెరిగాయన్నారు. బీడీలు చుట్టే కార్మికులకు వేయి బీడీలకు రూ.4.25 పైసల చొప్పున కూలి రేట్ల పెంపునకు ఒప్పందం కుదిరిందన్నారు. పెరిగిన వేతనాలు మే 1 నుంచి అమలు చేయాలని, లేనిపక్షంలో బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు దుర్గం లింగన్న, చిన్న రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వివరాలు

ప్రాజెక్టులు : 4

సెక్టార్లు : 37

మెయిన్‌ అంగన్‌వాడీలు : 816

మినీ అంగన్‌వాడీలు : 110

ప్రాజెక్టుల వారీగా సిబ్బంది

ప్రాజెక్టు అంగన్‌వాడీ టీచర్లు హెల్పర్లు

భైంసా 11 14

ఖానాపూర్‌ 0 21

ముధోల్‌ 7 25

నిర్మల్‌ 9 36

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ప్రక్షాళనకు సిద్ధమైంది. దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తూ వయోభారంతో ఉన్న టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా వాయిదా పడింది. పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తి కావడంతో అంగన్‌వాడీల వివరాలు సేకరిస్తోంది. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు జిల్లాలో 65 ఏళ్లు పైబడిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు 123 మంది ఉన్నారు. వీరంతా ఉద్యోగ విరమణ పొందనున్నారు.

123 మంది గుర్తింపు..

ప్రభుత్వ ఆదేశాలతో మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు జిల్లాలో 65 ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాల వివరాలు సేకరిస్తున్నారు. పదో తరగతి మెమో, టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా వయస్సును నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే ఐసీడీఎస్‌ అధికారుల వద్ద ఎంప్లాయ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో వివరాలు సైతం ఉన్నాయి. టీచర్ల వయస్సు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఆయాలు పెద్దగా చదువుకోక పోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంప్లాయ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో ఉన్న వివరాలకు ఆయాల ఆధార్‌ కార్డులో ఉన్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సివిల్‌ సర్జన్‌ వద్ద నుంచి వయస్సు నిర్ధారణ పత్రాలు తేవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా అప్పటికే అధికారులు సేకరించిన వివరాల మేరకు జిల్లాలో 65 ఏళ్లు పైబడి రిటైర్మెంట్‌కు సిద్ధంగా ఉన్నవారు టీచర్లు 27 మంది, ఆయాలు 96 మందితో కలిపి మొత్తంగా 123 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరంతా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే కొంతమంది మాత్రం పుట్టినతేదీ సరిగాలేని కారణంగా తాము తొందరగా విధుల నుంచి తప్పుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ కొందరు అధికారులను ఆశ్రయించారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. అలాంటి వారిని జిల్లా ఆస్పత్రిలో వయస్సు నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

గందరగోళం..

ఐసీడీఎస్‌ అధికారుల వద్ద ఎంప్లాయ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఈఎంఎస్‌)లో ఉన్న వివరాలకు ఆయాల వద్ద ఉన్న వివరాలకు పొంతన లేకుండా పోయింది. అంగన్‌వాడీ టీచర్లకు పదో తరగతి సర్టిఫికెట్లు ఉండగా ఆయాలు చదువు కోకపోవడంతో వారి వయస్సు నిర్ధారణ కోసం అధికారులు ఆధార్‌ కార్డులు సేకరిస్తున్నారు. అందులో కూడా చాలామంది వయస్సు హెచ్చుతగ్గులు ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్‌ సర్జన్‌ వద్ద నుంచి వయస్సు నిర్ధారణ పత్రాలు తేవాలని చెబుతున్నారు.

ప్రభుత్వానికి జాబితా..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ టీచర్‌, ఆయాలను గుర్తిస్తున్నాం. అర్హులైన వారి జాబితా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఏప్రిల్‌ 30 వరకు 65 ఏళ్ల వయస్సు పైబడిన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాలో 123 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. – ఏ.నాగమణి, డీడబ్ల్యూవో

న్యూస్‌రీల్‌

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌పై చిన్నచూపు..

అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన వారు అనేకం. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి అనుకున్న మేర సాయం అందడం లేదు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోతే మా పరిస్థితి ఏమిటని అంగన్‌వాడీలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ. 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వ సాయం ఏమాత్రం సరిపోదని టీచర్లు, ఆయాలు అంటున్నారు. అంగన్‌వాడీలకు రూ.5 లక్షలు, ఆయాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

926 అంగన్‌వాడీ కేంద్రాలు..

జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌, ముధోల్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 926 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 816, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 110 ఉన్నాయి. వీటిలో ప్రధాన సెంటర్లలో టీచర్‌, ఆయా, మినీ కేంద్రాల్లో టీచర్‌ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మినీ సెంటర్లలో కూడా టీచర్‌, ఆయాలు ఉండాల్సిందేనని ప్రభుత్వం చెప్పినా ఇంకా పోస్టులు భర్తీ చేయలేదు. ఇప్పటి వరకు అంగన్‌వాడీ సెంటర్లలో రిటైర్మెంట్‌ ప్రక్రియ లేకపోవడంతో వయస్సు పైబడిన వారి స్థానంలో కుటుంబ సభ్యులు విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీచర్లు, ఆయాలు తమకు ఉద్యోగ విరమణ చేపట్టి ప్రయోజనాలు కల్పించాలని కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేల బెన్‌ఫిట్‌ కల్పిస్తామని ప్రకటించింది.

అంగన్‌వాడీల ప్రక్షాళన
1/1

అంగన్‌వాడీల ప్రక్షాళన

Advertisement
 
Advertisement
 
Advertisement