బాల సదన్‌ను సందర్శించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి | Sakshi
Sakshi News home page

బాల సదన్‌ను సందర్శించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి

Published Sun, May 26 2024 2:45 AM

బాల సదన్‌ను సందర్శించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి

నిర్మల్‌ రూరల్‌: మండలంలోని కొండాపూర్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న బాలసదన్‌ను సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీనెల బాల సదన్‌ను సందర్శిస్తానని తెలిపారు. పిల్లలతో మాట్లాడి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జడ్జి వెంట జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నాగమణి, బాలల సంక్షేమ సమితి సభ్యురాలు సల్ల శ్రీలత, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఎం.కవిత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దేవి మురళి, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఎస్‌.రాజు, శ్రీరామ్‌ మూర్తి, శైలజ, కరుణశ్రీ, నరేందర్‌, సుమలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement