● డీపీవో శ్రీనివాస్‌ | Sakshi
Sakshi News home page

● డీపీవో శ్రీనివాస్‌

Published Sun, May 26 2024 2:45 AM

● డీపీవో శ్రీనివాస్‌

నర్సాపూర్‌ (జి): వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీపీవో శ్రీనివాస్‌ సూచించారు. నర్సాపూర్‌(జి) మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్డు, నర్సరీలను పరిశీలించి సరిగా నిర్వహణ చేపట్టాలన్నారు. సెగ్రిగేషన్‌ షెడ్డులో కంపోస్ట్‌ ఎరువులు తయారుచేసి రైతులకు అమ్మి పంచాయతీ ఆదాయం పెంచుకోవాలని సూచించారు. అనంతరం పలు దుకాణాలు, హోటళ్లను పరిశీలించారు. పరిసరాల్లో చెత్త లేకుండా చూడాలని యజమానులకు సూచించారు. ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో అమ్మ ఆదర్శ పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయనవెంట పీఆర్‌ ఏఈ శివకృష్ణ, పంచాయతీ కార్యదర్శి వీణారెడ్డి ఉన్నారు.

గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి

కుంటాల: గ్రామ పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలని డీపీవో శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కుంటాల మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో శనివారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించి క్లోరినేషన్‌ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను సిగ్రిగేషన్‌ షెడ్లకు తరలించి తడిచెత్త, పొడి చెత్త వేరుచేసి పంచాయతీ ఆదాయం పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో ఎంఏ.రహీం, ఏపీవో గట్టుపల్లి నవీన్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

యూనిఫాం స్టిచింగ్‌

త్వరగా పూర్తి చేయాలి

కుంటాల: పాఠశాలలు తెరుచుకునేలోపు విద్యార్థుల యూనిఫాం సిద్ధం చేయాలని ఈమేరకు స్టిచింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని డీపీవో శ్రీనివాస్‌ ఆదేశించారు. కుంటాలలో స్వయం సహాయక సంఘాల మహిళలు కుడుతున్న దుస్తులను పరిశీలించారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు దుస్తులు కుట్టే బాధ్యత అప్పగించిందని పేర్కొన్నారు. అనంతరం వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న డీపీవో శ్రీనివాస్‌

Advertisement
 
Advertisement
 
Advertisement