నిర్మల్‌ | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Sun, May 26 2024 2:45 AM

నిర్మ

మధురఫలమా..గరళమా!
మామిడి విషతుల్యంగా మారుతోంది. రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. ఈ పండ్లు తింటే అనారోగ్యం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

మరమ్మతుల్లో వేగం పెంచాలి

కడెం ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని అపరేషన్‌ అండ్‌ మెంటెనెన్స్‌ ఈఎన్‌సీ నాగేందర్‌రావు ఆదేశించారు. మరమ్మతు పనులను శనివారం పరిశీలించారు.

– 08లో

ఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024

8లోu

ఇంటర్‌ పరీక్ష కేంద్రం తనిఖీ

భైంసాటౌన్‌: పట్టణంలోని ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను ఇంటర్‌ విద్యాధికారి పరశురాం శనివారం తనిఖీ చేశారు. మదీనా కాలనీలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వశిష్ఠ జూనియర్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాల్లో పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జూఫిషాన్‌ సుల్తానా ఉన్నారు.

వేసవి సెలవుల్లో పల్లెలు పిల్లలతో సందడిగా మారాయి. అమ్మమ్మ ఇంటికో, నానమ్మ ఇంటికో వచ్చిన పిల్లలంతా సరదాగా ఊరిని చుట్టేస్తున్నారు. పెద్దవాళ్లూ పిల్లల్ని వెంటబెట్టుకుని అందరి ఇళ్లకు తీసుకువెళ్లి పరిచయం చేస్తున్నారు. పొలాల దగ్గరకి, చెరువు గట్టుకు తీసుకెళ్లి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పిల్లలు పల్లెల్లో దొరికే ప్రేమను పొందుతున్నారు. మట్టి వాసన తెలుసుకుంటున్నారు. కొందరు పిల్లలైతే ఆవులు, బర్రెల వెంట పరుగులు తీస్తున్నారు. పాలు ఎలా పితుకుతారో కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మనవలు, మనవరాళ్లు రావడంతో నానమ్మ, అమ్మమ్మలు సైతం కొత్త ఉత్సాహంతో వారికి రోజూ ఏదో ఒకటి తినిపించాలని ఉబలాటపడటం కనిపిస్తోంది. మామిడి పండ్ల సీజన్‌ కావడంతో తోటల వద్దకు తీసుకువెళ్లి పండ్లను తినిపిస్తున్నారు. అల్లనేరేడు, జామపండ్ల రుచి చూపిస్తున్నారు. పల్లెల్లో ప్రకృతిలో పిల్లలు ఎంజాయ్‌ చేస్తున్నారు.

– నిర్మల్‌ఖిల్లా

మనుమలు, మనుమరాళ్లతో కలిసి అష్టాచెమ్మ ఆడుతున్న వృద్ధురాలు

గతానికి ఇప్పటికీ ఎంతో తేడా...

గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకే కుటుంబంలో మూడు నాలుగుతరాల్లోని దాదాపు పది నుంచి పాతిక మంది వరకు చిన్న పిల్లలు, పెద్దలు ఉమ్మడిగా కలిసి జీవించేవారు. ఆ కుటుంబ సభ్యులందరూ యజమాని చెప్పిన బాటలోనే నడుచుకునేవారు. పిల్లలు పెద్దలు చెప్పే కథలు వినేవారు, వారితో కాలక్షేపం చేసేవారు. ప్రస్తుతం కుటుంబాలన్నీ విచ్చిన్నమై చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో వేసవికాలం సెలవులు అయినా ఆనందంగా అందరితో గడపడానికి కుటుంబ ప్రాధాన్యతను చిన్న పిల్లలకు తెలియ చెప్పడానికి సరైన అవకాశంగా భావిస్తున్నారు. తద్వారా చిన్నపిల్లలు పెద్దలతో వ్యవహరించే తీరు, నడవడిక, వ్యవహార శైలి, భావోద్వేగాలు, సామాజిక మర్యాదల వంటివి తెలుసుకుంటున్నారు.

సెలవులు.. సరదాగా..

సెలవులకి అమ్మమ్మ, మామయ్య బంధువుల ఇంటికి వెళ్లడం ద్వారా పిల్లల ఆలోచన విధానంలో, అలవాట్లలో మార్పులు జరుగుతాయి. బంధుత్వాలు తెలుస్తాయి. స్నేహితులు పరిచయం అవుతారు. కుటుంబం ప్రాధాన్యత తెలుస్తుంది. చిన్నప్పటి జ్ఞాపకాలను అనుభవాలను పిల్లలు మనసులో శాశ్వతంగా ఉంచుకుంటారు.

ఇటు పిల్లలకు.. అటు పెద్దలకు..

పిల్లలను గ్రామాలకు పంపడం ద్వారా ఇటు పిల్ల లకు, అటు పెద్దలకు లాభం జరుగుతుంది. సంప్రదాయాలు బదిలీ అవుతాయి. అనుబంధాలు పెరుగుతాయి. పిల్లలు దూరంగా ఉన్నారన్న భావన దూరం అవుతుంది. అమ్మమ్మ, తాతయ్యలను కలిశామన్న సంతోషం పిల్లలకు మిగులుతోంది. గ్రామీణ వాతావరణం అర్థమవుతుంది. పాతకాలపు వంటకాలు, పాడి పశువులు, పంట పొలాలు, వ్వయసాయం, రైతుల కష్టం గ్రామీణ పనులపై అవగాహన కూడా వస్తుంది.

1న రౌండ్‌ టేబుల్‌ సమావేశం

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ భవనంలో జూన్‌ 1న నిర్మల్‌ జిల్లా ఉచిత విద్య, వైద్య సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కోకన్వీనర్‌ పోశెట్టి తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో శనివారం సమావేశం నిర్వహించారు. జూన్‌ 1న నిర్వహించే రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఉచిత విద్య ,వైద్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని విద్యావంతులు, మేధావులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యకాంత్‌, లంబడా హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్‌ రోహిదాస్‌ పాలొగన్నారు.

సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక

న్యూస్‌రీల్‌

తనివితీరా ఆడుకోనివ్వండి...

నాలుగు గోడల మధ్య ఉండడం కన్నా పిల్ల లను తనివి తీరా ఆడుకోనివ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. గ్రామాలకు పంపించడం ద్వారా మమతలను పంచే అనుబంధాల వారధులుగా మారతారని పేర్కొంటున్నారు. ప్రేమానురాగాలకు అసలు సిసలైన కోవెలలు గ్రామాలే. ఆత్మీయ దోస్తులు అక్కడే పరిచయం అవుతారు.

పిల్లలతో స్వగ్రామానికి..

మాది సారంగాపూర్‌ మండలం జాం గ్రామం. ఉద్యోగరీత్యా మహబూబ్‌నగర్‌ జిల్లాలో పని చేస్తున్నాను. వేసవి సెలవుల్లో పిల్లలు నానమ్మ, తాతయ్యలతో గడపాలని తీసుకుని వచ్చాం. సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నారు. గ్రామీణ వాతావరణం అర్థం చేసుకుంటున్నారు. సాయంత్రాలు పంట పొలాల్లో గడుపుతూ వ్యవసాయం ప్రాధాన్యత తెలుసుకుంటున్నారు.

– జగ్గని భోజన్న– విగ్నేశ్వరి,

జామ్‌, మండలం సారంగాపూర్‌

అప్పటి రోజులే వేరు...

అప్పట్లో పాఠశాలలకు సెలవులు వచ్చాయంటే తెగ ఆనంద పడిపోయే వాళ్లం. సెలవుల్లో అమ్మమ్మ తాతయ్యల ఊర్లకు వెళ్లాలని ముందే ప్లాన్‌ చేసుకునే వాళ్లం. కొత్త స్నేహితులు పరిచయమయ్యేవారు దోస్తులతో రోజంతా ఆడుకునే వాళ్లం, పొలంగట్ల మీద స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆస్వాదించే వాళ్లం. సంప్రదాయ ఆటలు ఆడేవాళ్లం. ఇప్పుడు స్పెషల్‌ క్లాసులు, కంప్యూటర్‌ శిక్షణలు, ట్రైనింగ్‌లు అంటూ సెలవుల్లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

– పూసల చంద్రశేఖర్‌,

ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిర్మల్‌

నిర్మల్‌
1/8

నిర్మల్‌

నిర్మల్‌
2/8

నిర్మల్‌

నిర్మల్‌
3/8

నిర్మల్‌

నిర్మల్‌
4/8

నిర్మల్‌

నిర్మల్‌
5/8

నిర్మల్‌

నిర్మల్‌
6/8

నిర్మల్‌

నిర్మల్‌
7/8

నిర్మల్‌

నిర్మల్‌
8/8

నిర్మల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement