కిం కర్తవ్యం..!? | Sakshi
Sakshi News home page

కిం కర్తవ్యం..!?

Published Fri, May 24 2024 11:50 PM

కిం క

నిర్మల్‌

కదలరు.. వదలరు

బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో పలువురు ఉద్యోగులు ఏళ్లుగా తిష్ట వేసి ఇక్కడే పని చేస్తున్నారు. పలుకుబడి ఉపయోగించుకుంటూ కుర్చీని పట్టుకొనే ఉంటున్నారు.

9లోu

శనివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2024

ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

లక్ష్మణచాంద: మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని డీఆర్వో భుజంగరావు సూచించారు. రాచాపూర్‌, లక్ష్మణచాంద, ధర్మారం, పీచర, మునిపెల్లి, పార్‌పెల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యం, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మణచాంద, చింతల్‌చాంద, తిర్పెల్లి గ్రామాల్లోని రైస్‌ మిల్లులను పరిశీలించారు. మిల్లులకు వచ్చిన ధాన్యం లారీలను త్వరగా అన్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ జానవి, ఆర్‌ఐ దేవిక ఉన్నారు.

నిర్మల్‌: జిల్లాలోని నిర్మల్‌, భైంసా మున్సిపాలిటీల్లో రెండేళ్ల క్రితం మొదలైన నాలుగో తరగతి ఉద్యోగుల నియామకాల కథ అంతులేకుండా సాగుతూనే ఉంది. పలు మలుపులు తిరుగుతున్నా.. ఇప్పటికీ ఓ కొలిక్కి రావడం లేదు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ అప్పట్లో నియమితులైనవారు హైకోర్టుకు వెళ్లగా, కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ.. బాధితులకు వేతనాలు చెల్లించాలంటూ ఆదేశించింది. అసలు.. ఈ నియామక ప్రక్రియనే తప్పుదోవ పట్టించారని, విధివిధానాలను పాటించలేదని తాజాగా కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీడీఎంఏ) అప్పటి నిర్మల్‌, భైంసా మున్సిపల్‌ కమిషనర్లు సత్యనారాయణరెడ్డి, అలీంను మంగళవారం సస్పెండ్‌ చేసింది. మరోవైపు.. నియమితులైనవారికి అప్పటి కలెక్టర్‌ ముషరఫ్‌అలీ వేతనాలు ఇవ్వకుండా కోర్టుధిక్కారానికి పాల్పడ్డారంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన గురువారం స్టే తెచ్చుకున్నారు. వీటన్నింటి మధ్య ఆ.. నియామకాలకు సంబంధించిన ఫైల్‌ మిస్సయ్యిందన్న విషయం బయటకు రావడంతో అసలు ఈ పోస్టులపై ఏం చేస్తారనేది తేలడం లేదు.

కమిషనర్లపై చర్యలు..

నాలుగో తరగతి పోస్టుల ఎంపిక ప్రక్రియలో కీలకంగా ఉన్న కలెక్టర్‌తోపాటు కమిషనర్లపైనా ప్రభావం పడింది. అసలు ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ తీసుకోకుండా, విధివిధానాలు పాటించకుండా, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా పోస్టుల ఎంపిక ప్రక్రియ చేపట్టారంటూ సీడీఎంఏ సీరియస్‌ అయ్యింది. అప్పటి నిర్మల్‌, భైంసా కమిషనర్లు సత్యనారాయణరెడ్డి, అలీంపై సస్పెన్షన్‌ వేటు వేసింది. రెండేళ్లక్రితం జరిగిన నియామకాలపై తాజాగా స్పందించిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అప్పటి కలెక్టర్‌, కమిషనర్లకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చిన తరుణంలోనే ఇటు సీడీఎంఏ నుంచి కమిషనర్ల సస్పెన్షన్‌ ఆర్డర్లు రావడం గమనార్హం.

ఇప్పుడేం చేస్తారో..

తమ చేతుల్లోకి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు, ట్రెజరీల్లోకి పేర్లు వచ్చినా.. తమకు వేతనాలు ఇవ్వకపోవడంతో నియమితులు అనిశ్చితిలో ఉన్నారు. కోర్టులో తీర్పు వచ్చినప్పటికీ అధికారుల నుంచి తమకు అనుకూలంగా ఎలాంటి కదలిక లేకపోవడంతో వారిలో చాలామంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ పోస్టుల నియామకాలపై కోర్టుకు వెళ్లిన నిరుద్యోగులు సరైన న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా మారింది.

న్యూస్‌రీల్‌

‘మున్సిపల్‌’ పోస్టుల్లో అనిశ్చితి..!

నియమితులకు వేతనాలివ్వాలన్న కోర్టు

నియమించినవారినే తొలగించిన సీడీఎంఏ

హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న అప్పటి కలెక్టర్‌

వేతనాలివ్వాలని..

నిర్మల్‌ మున్సిపాలిటీలో 2022, ఫిబ్రవరి 14న అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చారు. వీటి ప్రకారం ట్రెజరీకీ వెళ్లారు. కానీ.. వేతనాలు మాత్రం రాలేదు. దీంతో నియమితుల్లో నుంచి 15 మంది హైకోర్టుకు వెళ్లారు. తమకు 2022 ఫిబ్రవరి నెల నుంచి వేతనాలను ఇప్పించాలంటూ కోరారు. ఈమేరకు అదే ఏడాది సెప్టెంబర్‌లో కోర్టు వీరికి జీతాలు ఇవ్వాలని ఆదేశించింది. అంతకు నోటిఫికేషన్‌, పోస్టుల ఎంపిక తీరుపై పలువురు నిరుద్యోగులు వేసిన పిటీషన్లనూ ఇందులోనే ఇంప్లీడ్‌ చేశారు. ఈమేరకు తమకు వేతనాలను ఇస్తారని నియమితులు ఆశించారు. నెలలు గడిచిన తమకు వేతనాలు ఇవ్వకపోవడంతో మరోసారి వారు కోర్టును ఆశ్రయించారు. మే 3న అప్పటి కలెక్టర్‌ ముషరఫ్‌అలీ, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి ధిక్కరణకు పాల్పడినట్లు భావించిన హైకోర్టు నెలరోజుల జైలుశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

స్టే తెచ్చుకున్న మాజీ కలెక్టర్‌..

నిర్మల్‌ పూర్వ కలెక్టర్‌(ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ) మహమ్మద్‌ ముషారఫ్‌అలీ ఫారూఖీ హైకోర్టు నుంచి తనపై వచ్చిన జైలుశిక్ష ఉత్తర్వుల నుంచి ఊరట పొందారు. కోర్టు ధిక్కరణ కేసులో ఈనెల 3న సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఒక నెల సాధారణ జైలు శిక్ష ఉత్తర్వులపై ఆయన కోర్టులో అప్పీల్‌కు వెళ్లగా గురువారం ద్విసభ్య ధర్మాసనం ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని ఆదేశించింది.

కిం కర్తవ్యం..!?
1/1

కిం కర్తవ్యం..!?

Advertisement
 
Advertisement
 
Advertisement