కడెం మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి | Sakshi
Sakshi News home page

కడెం మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి

Published Fri, May 24 2024 11:50 PM

కడెం మరమ్మతులు  త్వరగా పూర్తి చేయాలి

కడెం: కడెం ప్రాజెక్టు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు మరమ్మతు పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. వానాకాలం సీజన్‌ సమీపిస్తున్న దృష్ట్యా మరమ్మతు పనుల్లో వేగం పెంచాలన్నారు. అనంతరం లింగాపూర్‌ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సారంగాపూర్‌ గ్రామానికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతు పనులు పరిశీలించారు. కలెక్టర్‌ వెంట డీఈవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ సుజాత, ఎంపీడీవో అరుణ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement