● గత ఎన్నికలతో పోలిస్తే రికార్డు ● అసెంబ్లీ ఎన్నికలతో సమానంగా.. ● గణనీయంగా పెరిగిన ఓటింగ్‌ ● అత్యధికంగా ముధోల్‌లో నమోదు | Sakshi
Sakshi News home page

● గత ఎన్నికలతో పోలిస్తే రికార్డు ● అసెంబ్లీ ఎన్నికలతో సమానంగా.. ● గణనీయంగా పెరిగిన ఓటింగ్‌ ● అత్యధికంగా ముధోల్‌లో నమోదు

Published Wed, May 15 2024 8:45 AM

● గత ఎన్నికలతో పోలిస్తే రికార్డు ● అసెంబ్లీ ఎన్నికలతో స

నిర్మల్‌: జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు రికార్డు పోలింగ్‌ను నమోదు చేశాయి. దాదాపు అసెంబ్లీ ఎన్నికల శాతంతో సమానంగా నమోదు కావడం గమనార్హం. సోమవారం పోలింగ్‌ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మంగళవారం పోలింగ్‌శాతాన్ని ప్రకటించారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నిర్మల్‌ జిల్లాలో మొత్తం 73.20 శాతం నమోదైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 77.28 శాతం నమోదైంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్ల్లో 65 శాతం వరకు నమోదైంది. ఈసారి గణనీయంగా ఓటింగ్‌ శాతం పెంచడంలో అధికారయంత్రాంగ సఫలమైంది. కొత్త ఓటర్లూ ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో 73.20 శాతం పోలింగ్‌ నమోదైంది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా..

ముధోల్‌లో అత్యధికంగా 75.63 శాతం, ఖానాపూర్‌లో 72.20 శాతం, నిర్మల్‌ నియోజకవర్గంలో 71.68 శాతం ఓటింగ్‌ నమోదైంది. జిల్లాకేంద్రం ఉ న్న నిర్మల్‌ నియోజకవర్గం కంటే.. రూరల్‌ ఏరియాలు ఉన్న ముధోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో అధికంగా పోలింగ్‌ నమోదు కావడం విశేషం.

పోలింగ్‌శాతం వివరాలు..

నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఓటేసిన ఓటర్లు ఓటింగ్‌ శాతం

నిర్మల్‌ 2,58,314 1,85,168 71.68

ముధోల్‌ 2,54,579 1,92,546 75.63

ఖానాపూర్‌ 2,24,623 1,62,101 72.20

మొత్తం 7,37,516 5,39,815 73.20

Advertisement
 
Advertisement
 
Advertisement