క్లాస్‌లో అందరి ముందే లవర్‌కు ముద్దుపెట్టిన అబ్బాయి.. తరువాత ఏం జరిగిందంటే..

Viral Video: Two College Lovers Kiss In Front Of Professor, See What happen Next - Sakshi

కాలేజీలో ఇద్దరు లవర్స్‌ రొమాన్స్‌ చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురి మధ్య ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. క్లాస్‌లో ప్రొఫెసర్‌ ముందే ఏకంగా ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ పోస్టు చేయగా దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అయితే అందరూ ఎందుకు అంతగా నవ్వుకుంటున్నారో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. అప్పడే ఇందులోని ట్విస్ట్‌ ఎంటో తెలుస్తుంది.

క్లాస్‌ రూమ్‌లో ప్రొఫెసర్‌ ఉండగా వెనకాల కూర్చున్న ఓ వ్యక్తి తన పక్కనే ఉన్న యువతితో రొమాన్స్‌ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. యువతి భుజంపై చేయి వేసి ఆమె జుట్టును అలా ప్రేమగా కదిలిస్తూ తన చెంపను ముద్దాడుతాడు. దీనిని వెనకాల నుంచి ఓ వ్యక్తి రికార్డ్‌ చేశాడు. అయితే రికార్డ్‌ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కెమెరాను వెనకాల నుంచి ముందుకు తీసుకొచ్చి వాళ్ల ముఖాన్ని చూపిస్తాడు. దీంతో అసలు ‘గర్ల్‌ఫ్రెండ్’ ఎవరో చూడటమే ఈ వీడియోలోని ట్విస్ట్‌.  

పొడవాటి జుట్టుతో వెనక కూర్చున్న వ్యక్తి అచ్చం అమ్మాయిలాగా కనిపించినప్పటికీ అక్కడుంది అబ్బాయి.  ఆ ‘ప్రియుడు’ కేవలం తన స్నేహితుడి జుట్టుతో చిలిపిగా అలా చేశాడు. చివరికి ముగ్గురు స్నేహితులు దగ్గరగా కూర్చుని నవ్వుతూ కనిపించారు. అయితే రొమాన్స్‌గా భావించిన నెటిజన్లు.. చివరికి అది 'బ్రొమాన్స్' అని తేలడంతో పడి పడి నవ్వుకున్నారు. మీరూ ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు చూడండి..
చదవండి: గుడ్‌ క్యాచ్‌! ఆకాశం నుంచి పడిపోతున్న రాకెట్‌ని పట్టుకున్న హెలికాప్టర్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top