నేడు బీజేపీలోకి కాంగ్రెస్‌ దిగ్గజ నేత! | Suresh Pachouri To Join BJP Today | Sakshi
Sakshi News home page

Suresh Pachauri: నేడు బీజేపీలోకి కాంగ్రెస్‌ దిగ్గజ నేత!

Mar 9 2024 9:53 AM | Updated on Mar 9 2024 10:12 AM

Suresh Pachauri to Join BJP Today - Sakshi

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి, కమలదళంలో చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్  సీనియర్‌ నేత సురేష్ పచౌరీ కూడా కాంగ్రెస్‌ను వీడారు. 

సురేష్ పచౌరీ నేడు (శనివారం) భోపాల్‌లో జరగనున్న ఒక కార్యక్రమంలో బీజేపీలో చేరబోతున్నారు. 1972లో ఆయన ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో చేరి, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1983 వరకు ఈ పదవిలో కొనసాగారు. 

రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ పచౌరీ 1984లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై, ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ నేత సురేష్ పచౌరీ 1984,1990, 1996, 2002లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగానూ పనిచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement