Shocking Video: Stunning Water Spout In Madhya Pradesh Goes Viral - Sakshi
Sakshi News home page

స్టన్నింగ్‌ టోర్నడో: వీడియో వైరల్‌

Sep 1 2021 1:02 PM | Updated on Sep 1 2021 7:48 PM

Madhya Pradesh:Stunning Water Spout In Appears To Touch The Sky - Sakshi

భోపాల్‌:ఒకవైపు దేశంలోని పలుప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కూడా బలమైన గాలులు, వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే సిధి జిల్లాలోని భూమాద్‌, దేవ్రిడ్యామ్‌వద్ద అద్భుత దృశ‍్యం ఆవిష్కృతమైంది. డ్యామ్‌లోని నీళ్లు ఒక్కసారిగా పైకి పొంగి,ఆకాశానికి  సుడులు తిరుగుతూ ఎగిసింది. భీకరమైన గాలులు సుడులు తిరుగుతూ టోర్నడోగా మారి ఆకాశాన్ని తాకినంత పనిచేసింది. ఈ టోర్నడో పరిసర ప్రాంతాల ప్రజలను దిగ్ర్భాంతికి గురిచేసింది. 

రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధి జిల్లాలోని దేవ్రి డ్యామ్ వద్ద సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీన్ని చూసేందుకు  స్థానికులు ఆ ప్రాంతానికి ఎగబడ్డారు. ఇపుడు ఈ వీడియో  వైరల్ అయింది. 

చదవండి :  స్వీట్ అడలిన్‌ అద్భుత ఫోటో షూట్‌..విషయం తెలిస్తే కన్నీళ్లే!

హర్ష్‌ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement