ఎల్‌.కే అద్వానీకి అస్వస్థత | BJP veteran LK Advani admitted to Apollo Hospital with chest infection | Sakshi
Sakshi News home page

ఎల్‌.కే అద్వానీకి అస్వస్థత

Oct 16 2026 11:56 PM | Updated on Oct 16 2026 11:56 PM

BJP veteran LK Advani admitted to Apollo Hospital with chest infection

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (98) అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా శుక్రవారం సాయంత్రం ఆయనను న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అద్వానీ పల్మనరీ  విభాగంలో చికిత్స పొందుతున్నారు. 

కాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ, ఈ ఏడాది మే నెలలోనూ వయసురీత్యా తలెత్తిన సమస్యల కారణంగా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఇటీవ‌లే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మోదీతో అప్యాయంగా మాట్లాడిన అద్వానీ రోజుల వ్య‌వ‌ధిలోనే మళ్లీ ఆసుపత్రిలో చేరడం గమనార్హం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement