Hathras Stampede: అఖిలేష్‌ కూడా బాబా భక్తుడే.. ఫొటో వైరల్‌ | Akhilesh Yadav Also Once Came To Baba Satsang | Sakshi
Sakshi News home page

Hathras Stampede: అఖిలేష్‌ కూడా బాబా భక్తుడే.. ఫొటో వైరల్‌

Jul 3 2024 10:04 AM | Updated on Jul 3 2024 10:32 AM

Akhilesh Yadav Also Once Came To Baba Satsang

యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121 దాటింది. నారాయణ్ సాకార్‌ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

యూపీలో ఈ బాబాకు లెక్కకు మించిన భక్తులు, అనుచరులు ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గతంలో భోలే బాబా సత్సంగానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

నాడు భోలే బాబా సత్సంగానికి హాజరైన అఖిలేష్ యాదవ్ తన ప్రసంగంలో బాబాను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలను అఖిలేష్‌ అప్పట్లో తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో అఖిలేష్‌ వీఐపీ సీట్లలో కూర్చుని కనిపిస్తున్నారు. మరో ఫోటోలో అఖిలేష్ యాదవ్ బాబా భక్తులను ఉద్దేశించి ప్రసంగించడాన్ని చూడవచ్చు. 
 

Advertisement
 
Advertisement
Advertisement