Sakshi News home page

50 ఏళ్లకు పైగా కళామతల్లి సేవ

Published Wed, Nov 15 2023 1:52 AM

- - Sakshi

● సంగీతంపై మక్కువ పెంచుతున్న కళాశాల ● ప్రత్యేక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రదర్శన ● అనువైన సమయాల్లో శిక్షణ ● మానసిక ప్రశాంతతో పాటు ఉద్యోగ అవకాశం ● గృహిణులతో పాటు ఉద్యోగుల ఆసక్తి

గాత్రంలో శిక్షణ..

దాసరి పార్వతి. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన ఈ యువతి పాటతోనే ప్రపంచానికి పరిచయమైంది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఈమె ఒకప్పుడు సంగీతం నేర్చుకోవడానికి మరో ప్రాంతానికి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటిది ఈమె గొంతులో పలికిన పాట తన గ్రామం ఎప్పుడూ చూడని బస్సును పరిచయం చేయగలిగింది. ఈమె ఒక్కరే కాదు.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాకు చెందిన ఎంతో మంది ఇటీవల కాలంలో టెలివిజన్‌ కార్యక్రమాలతో తమ ప్రతిభను చాటుతున్నారు.

సాక్షి, కర్నూలు డెస్క్‌

కప్పుడు పెళ్లి చూపులు అనగానే సంగీతం వచ్చా అని అడిగేవారు. ఏదమ్మా ఓ పాట పాడమని అడిగి మరీ మైమరిచిపోయేవారు. ఆ తర్వాత.. సంగీతం ఏముందిలే, పిల్లలకు జోలపాట పాడితే చాలనుకున్నారు. ఇప్పుడిక అమ్మాయిలు దొరకడమే కష్టమవుతున్న పరిస్థితుల్లో సంగీతం మాటే మర్చి సర్దుకుపోతున్నారు. పిల్లలకు కనీస సంగీత జ్ఞానం నేర్పుదామని కొందరు తల్లిదండ్రులు భావిస్తున్నా.. ఆ దిశగా గొంతు విప్పేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. కనీసం టీవీల్లో పాత పాటలు చూద్దామన్నా.. పిల్లలు రిమోట్‌ లాగేసుకొని మార్చేయడం ప్రతి ఇంట్లో కనిపించే తంతే. పండగలు పబ్బాల సమయంలో ఏ గుడిలోనో, లేక ప్రత్యేక కార్యక్రమాల్లోనో తప్ప కచేరీల ఊసే ఉండటం లేదు. ఇక కొన్ని వాయిద్యాల పేర్లు కూడా ఇప్పటి తరం తెలుసుకోలేకపోవడం చూస్తే సంగీతం ఏస్థాయిలో కనుమరుగవుతుందో అర్థమవుతోంది. ఇలాంటి రోజుల్లో కూడా కర్నూలు నగరంలోని ప్రభుత్వ శారద సంగీత, నృత్య కళాశాల సంగీత పరిమళాలను వెదజల్లుతోంది. ఆ భవనం నుంచి ప్రతి రోజూ వినిపించే రాగాలను వింటే ఎప్పుడో ఒకప్పుడు తిరిగి పూర్వ వైభవం వస్తుందనే ఆశ కలుగుతుంది.

అందరికీ అనువైన సమయంలో..

ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ర్యాంకుల వెంట పరుగులు తీయిస్తున్నారు. ఆ దిశగానే పిల్లల బుర్రలను పదును పెడుతున్నారు. పాఠశాలకు వెళ్లామా.. ఇంటికి వచ్చామా.. ఇలానే సాగుతోంది జీవనం. చాలా అరుదుగా పిల్లలను సంగీతంలోనూ తీర్చిదిద్దాలనే ఆలోచనకు వేదికగా నిలిచిన శారద సంగీత కళాశాల అనువైన సమయాల్లోనే శిక్షణ ఇస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కర్నూలు పాత బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ భవనం ఎన్నో రాగాలను పలుకుతోంది. పాటలు పాడించడమే కాదు వివిధ రకాల వాయిద్యాలను పలికించడంలోనూ నిష్ణాతులను చే స్తోంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు కూడా తోడు కా వడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

జీవితంలో స్థిరపడే దిశగా..

సంగీతం నేర్చుకుంటే ఏమొస్తుంది, మహా అయితే ఇంట్లో కూనిరాగాలు తీయడం మినహా అనే భావనను ఈ కళాశాల తొలగిస్తోంది. తీరిక సమయాల్లో తీసుకునే శిక్షణ జీవితంలో స్థిరపడేందుకు బాటలు కూడా వేస్తోంది. ఇక్కడ సర్టిఫికెట్‌ కోర్సులతో పాటు డిగ్రీలు కూడా చేసే అవకాశం ఉండటంతో పాఠశాలల్లో ఆయా విభాగాల ఉపాధ్యాయులుగా కూడా రాణిస్తున్నారు. శారద కళాశాల నుంచి ఇప్పటి వరకు 50 మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి

పాటకు రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందంటారు. అంతేకాదు.. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఎలాంటి మత్తు ఇంజెక్షన్‌ ఇవ్వకుండా కేవలం మ్యూజిక్‌ వింటూనే చేయించుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. అమెరికాలో నిర్వహించిన ఓ పరిశో

ధన ఇదే విషయాన్ని వెల్లడి చేస్తోంది. రెండు రూములను ఎంచుకొని, ఒకే విధమైన విత్తనాలను వాటిలో పెంచడం మొదలుపెట్టారు. వీటిలో ఒక రూములో శాసీ్త్రయ సంగీతం అదనంగా ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఈ మొక్కల ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉన్నట్లు పరిశోధన ఫలితం వెల్లడైంది.

గత ఐదేళ్లలో విద్యార్థుల సంఖ్య

సంగీతం పేరు చెప్పగానే రాష్ట్ర ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చే పేరు పద్మభూషణ్‌ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ వైద్యులుగా కర్నూలు మెడికల్‌ కళాశాలలో పనిచేస్తూ ఇక్కడే పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత తుదిశ్వాస విడిచే వరకు కర్నూలులోనే ఉండిపోయారు. రోగాలను, రాగాలను సరిచేసిన సవ్యసాచిగా పేరుగడించారు. శాసీ్త్రయ సంగీతానికి ఊపిరి పోసిన ఆయన ఎంతో మందిని వైద్య నిష్ణాతులుగా, సంగీత శిఖామణులుగా తీర్చిదిద్దడం విశేషం.

వయస్సు అంకె మాత్రమే..

కళాశాలకు వచ్చే విద్యార్థులను చూస్తే వయస్సు ఒక అంకె మాత్రమే అనే విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ వయస్సులోనే చదువుకోవాలి, ఆ వయస్సులోనే ఏదైనా సాధ్యమనే భావనను చెరిపేస్తున్నరు ఇక్కడి విద్యార్థులు. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులతో పాటు నాలుగైదేళ్ల చిన్నారులు సైతం ఇక్కడ శిక్షణ పొందుతుండటం విశేషం. కుల మతాలకు అతీ తంగా, వయస్సు భేదం లే కుండా ఇక్కడ పలుకుతున్న రాగాలు.. కదులుతున్న అందియ లను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.

ప్రభుత్వ శారదా సంగీత నృత్య కళాశాలలో అందుబాటులోని కోర్సులు

గాత్రం కూచిపూడి డోలు మృదంగం వీణ నాదస్వరం

Advertisement
Advertisement