నంది వడ్డెమాన్‌ ఆధ్యాత్మిక ప్రాంతం | Sakshi
Sakshi News home page

నంది వడ్డెమాన్‌ ఆధ్యాత్మిక ప్రాంతం

Published Sun, May 26 2024 5:15 AM

నంది వడ్డెమాన్‌ ఆధ్యాత్మిక ప్రాంతం

బిజినేపల్లి: నందివడ్డెమాన్‌ పూర్వం నుంచే ఆధ్యాత్మిక ప్రదేశమని.. ఈ ప్రాంతం నిత్యం పూజలు, హోమాలతో కళకళలాడుతూ ఉండేదని ఇక్కడి ఆలయాలు, వాటిలోని శిల్పకళ, చరిత్రను చూస్తే తెలుస్తుందని ఉజ్జయిని పీఠాధిపతి జగద్గురు సిద్ధలింగ రాజదేశి శివాచార్య భగవత్పాదులు అన్నారు. శనివారం ఆయన గ్రామంలోని జైష్ట్యాదేవి సమేత శనైశ్వరస్వామిని దర్శించుకుని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో త్రికూట, కాళీమాత ఆలయాలు ఉండటం విశేషమన్నారు. చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలదేనని.. ఆలయాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ గోపాల్‌రావు, అర్చకులు శాంతికుమార్‌, ఉమ్మయ్య, మల్లికార్జున్‌, కమిటీ సభ్యులు వీరశేఖరాచారి, ప్రభాకర్‌, పుల్లయ్య పాల్గొన్నారు.

ఉజ్జయిని పీఠాధిపతి జగద్గురు సిద్ధలింగ

రాజదేశి శివాచార్య భగవత్పాదులు

Advertisement
 
Advertisement
 
Advertisement