బర్త్ డే పార్టీకి రష్మిక-విజయ్ కలిసి వెళ్లారా? | Did Vijay Devarakonda Participated In Rashmika Mandanna Birthday Celebrations? Instagram Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Vijay-Rashmika: క్రేజీ జంట.. కలిసే పార్టీ చేసుకున్నారా?

Apr 6 2025 7:03 PM | Updated on Apr 6 2025 7:50 PM

Vijay Devarakonda Participate Rashmika Birthday Celebrations

రష్మిక పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా టాక్. రష్మిక ఒకటి రెండుసార్లు పరోక్షంగా తన ప్రేమ గురించి బయటపెట్టింది గానీ విజయ్ పేరు మాత్రం చెప్పలేదు. మళ్లీ ఇప్పుడు వీళ్ల గురించి ఈ డిస్కషన్ ఎందుకంటే దానికి ఓ కారణముంది.

(ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)

రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. వరస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఒమన్ దేశానికి వెళ్లింది. అక్కడే బీచ్ ఒడ్డున సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని ఇన్ స్టాలో కూడా పోస్ట్ చేసింది.

కట్ చేస్తే విజయ్ దేవరకొండ.. బీచ్ ఒడ్డున తీసుకున్న కొన్ని ఫొటోల్ని ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇవి చూసిన కొందరు నెటిజన్లు.. రష్మికతో కలిసి విజయ్ బర్త్ డే పార్టీలో పాల్గొనే ఉంటాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా ఎప్పుడూ పోస్ట్ పెడతారా అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఓవైపు వివాదాలు.. మరోవైపు వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డ్)

Advertisement
 
Advertisement
Advertisement