Vijay Antony Hatya's theatrical rights were acquired by Suresh Productions and Asian Cinemas - Sakshi
Sakshi News home page

Vijay Antony Hatya: హత్య చేసిందెవరు?

Jul 15 2023 4:35 AM | Updated on Jul 15 2023 9:35 AM

Vijay Antony Hatya theatrical rights acquired by Suresh Productions and Asian Cinemas - Sakshi

విజయ్‌ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. లోటస్‌ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌పై కమల్‌ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్‌ .బి, పంకజ్‌ బోరా, విక్రమ్‌ కుమార్, తాన్‌ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్‌ శంకర్, ఆర్‌వీఎస్‌ అశోక్‌ కుమార్‌ నిర్మించిన ‘హత్య’ ఈ నెల 21న రిలీజవుతోంది.

సురేశ్‌ ప్రొడక్షన్స్, ఏషియన్‌ సినిమాస్‌ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాయి. ‘‘ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌ ఆంటోని డిటెక్టివ్‌ ΄ాత్ర చేశారు. ఈ క్యారెక్టర్‌లో ఆయన సరికొత్త లుక్‌లో కనిపిస్తారు’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement