వెంకీ మామ చేతిలో మరో రీమేక్‌.. ఆ 'లైసెన్స్‌' వస్తుందా ? | Victory Venkatesh Another Remake Film Is Driving License | Sakshi
Sakshi News home page

Venkatesh: వెంకీ మామ చేతిలో మరో రీమేక్‌.. ఆ 'లైసెన్స్‌' వస్తుందా ?

Dec 6 2021 8:27 AM | Updated on Dec 6 2021 8:44 AM

Victory Venkatesh Another Remake Film Is Driving License - Sakshi

Victory Venkatesh Another Remake Film Is Driving License: విభిన్న కథా చిత్రాలతో విజయపథంలో దూసకుపోతున్నారు విక్టరీ వెంకటేశ్‌. కథ నచ‍్చితే మల్టీ స్టారర్‌, రీమేక్‌ చిత్రాలు చేయడానికి అస్సలు వెనుకాడరు. ఇటీవల మలయాళ రీమేక్‌ చిత్రం 'దృశ్యం 2'తో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు వెంకీ మామ. టాలీవుడ్‌లో రీమేక్‌ చిత్రాలకు పెట్టింది పేరు వెంకటేశ్‌. సుమారు 25కుపైగా రీమేక్‌ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరో రీమేక్‌ చేయడానికి వెంకీ మామ సిద్ధంగా ఉన్నారని సమాచారం. మలయాళంలో హిట్‌ అయిన 'డ్రైవింగ్ లైసెన్స్‌' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారట. 

అయితే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకున్నారు. మొదట వెంకటేష్‌, రవితేజలు కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో 'డ్రైవింగ్‌  లైసెన్స్‌'ను తెరకెక్కించడం ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ చిత్రం రామ్‌ చరణ్‌ నుంచి గీతా ఆర్ట్స్‌ చేతికి వచ్చిందని సమాచారం. వెంకటేశ్‌తో ఈ సినిమా తీయాలని గీతా ఆర్ట్స్‌ భావిస్తోందట. రవితేజ కోసం అనుకున్న పాత్రలో ఓ యంగ్‌ హీరోను తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ మామ 'ఎఫ్‌ 3'తో పాటు ఓ వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉ‍న్నారు. వాటి తర్వాత 'డ్రైవింగ్‌ లైసెన్స్‌' కోసం కష్ట పడతారని సమాచారం. 

ఇదీ  చదవండి: 'ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం'

Advertisement
 
Advertisement
Advertisement