వరుణ్‌తేజ్‌ను మాయ ఎందుకు ప్రేమిస్తుంది? | Varun Tej introduces Saiee Manjrekar | Sakshi
Sakshi News home page

గని ప్రేమలో మాయ

Apr 19 2021 6:28 AM | Updated on Apr 19 2021 7:38 AM

Varun Tej introduces Saiee Manjrekar - Sakshi

సయీకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. మాయ జీవితంలోకి గని ఎందుకు రావాల్సి వచ్చింది? గనిని మాయ ఏ కారణంతో ప్రేమిస్తుంది?..

గని మనసును మాయ చేసింది మాయ. తన ప్రేమ రింగులో బాక్సర్‌ గనిని బంధించింది. ఈ మాయ, గనిల ప్రేమకథను వెండితెరపై చూడటానికి కాస్త సమయం ఉంది. వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. హీరోయిన్‌గా సయీ మంజ్రేకర్‌ నటిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాక్సర్‌ గని పాత్రలో వరుణ్‌ తేజ్, కాలేజ్‌ స్టూడెంట్‌ మాయ పాత్రలో సయీ మంజ్రేకర్‌ కనిపిస్తారు.

‘‘సల్మాన్‌ఖాన్‌ ‘దబాంగ్‌ 3’లో సయీ మంజ్రేకర్‌ నటన చూసి ‘గని’ సినిమాకి తీసుకున్నాం. సయీకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. మాయ జీవితంలోకి గని ఎందుకు రావాల్సి వచ్చింది? గనిని మాయ ఏ కారణంతో ప్రేమిస్తుంది? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగు డైలాగ్స్‌ని సయీ బాగా పలుకుతోంది. షూటింగ్‌కు ఒక రోజు ముందే ఆమెకు డైలాగ్స్‌ ఇస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement