‘నింద’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది: వరుణ్‌ సందేశ్‌ | Varun Sandesh Talk About Nindha Movie | Sakshi
Sakshi News home page

‘నింద’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది: వరుణ్‌ సందేశ్‌

Jun 18 2024 6:12 PM | Updated on Jun 18 2024 7:02 PM

Varun Sandesh Talk About Nindha Movie

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నింద కూడా అలాంటి కథే. కానీ స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు’అని అన్నారు హీరో వరుణ్‌ సందేశ్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘నింద’. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్‌ సందేశ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లాను. ఆ టైంలోనే రాజేష్ గారు ఈ నింద కథను చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేసేద్దామని అన్నాను.

→ నిందలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్‌గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను.

→ ‘నింద’ లాంటి చిత్రాలకు ఆర్ఆర్, కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. మాకు మంచి టెక్నీషియన్లు దొరికారు. సాంతు ఓంకార్ తన ఆర్ఆర్, మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. రమీజ్ కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది.

→  మా దర్శక నిర్మాత రాజేష్ గారి ఫ్రెండ్ యూఎస్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ నవీన్‌ గారికి తెలుసు. అలా మైత్రీ శశి గారు మా సినిమాను చూశారు. మూవీ నచ్చితేనే రిలీజ్ చేస్తామని శశిగారు అన్నారు. ఆయన చిత్రాన్ని చూశారు. బాగా నచ్చింది. అందుకే మా సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.

→ నింద తరువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. నిందలోని కారెక్టర్‌కు ఆ సినిమాలోని పాత్రకు అస్సలు పోలిక ఉండదు. అది జూలైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అది కాకుండా కానిస్టేబుల్ అనే ఓ సినిమాను కూడా చేస్తున్నాను.

Advertisement
 
Advertisement
Advertisement