నా 17 ఏళ్ల కెరీర్‌లో ‘విరాజి’లాంటి సినిమా చేయలేదు: వరుణ్‌ సందేశ్‌ Varun Sandesh Talk About Viraaji Movie At Title Announcement Event | Sakshi
Sakshi News home page

నా 17 ఏళ్ల కెరీర్‌లో ‘విరాజి’లాంటి సినిమా చేయలేదు: వరుణ్‌ సందేశ్‌

Jul 2 2024 6:47 PM | Updated on Jul 2 2024 7:14 PM

Varnu Sandesh Talk About Viraaji Movie At Title Announcement Event

డైరెక్టర్‌  హర్ష  విరాజి కథ చెప్పినప్పుడు.. ఫస్టాఫ్‌ పది నిమిషాల విన్న కథ ఇలా ఉంటుందని రెండు మూడు చోట్ల గెస్‌ చేశా. కానీ సెకండాఫ్‌కు వచ్చేసరికి గూస్‌ బంప్స్‌ వచ్చాయి. నా 17 ఏళ్ల కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను’ అన్నారు యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌. ‘నింద’తో మంచి సక్సెస్‌ అందుకున్న వరుణ్‌..త్వరలోనే ‘విరాజి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆద్యంత్ హర్ష  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి  ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు

తాజాగా ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్ మెంట్ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్‌. ఈ సందర్భంగా వరుణ్‌ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను డిఫరెంట్‌ పాత్రలో కనిపిస్తాను. ఈ నెల 10 ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం. అది చూడగానే సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ క్యారెక్టర్‌ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. ఆగస్ట్‌ 2న విడుదల కాబోతున్న ఈచిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.వరుణ్‌ను తెరపై కొత్తగా చూస్తారని అన్నారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల . ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆద్యంత్‌ హర్ష, నటులు రఘు కారుమంచి, ప్రమోదిని, ఫని, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎబినెజర్‌ పాల్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement