తల్లి పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. | Varalakshmi Sarathkumar Wrap Up Shabri Movie Shooting | Sakshi
Sakshi News home page

Varalakshmi Sarathkumar: తల్లి పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌..

Sep 27 2022 8:46 AM | Updated on Sep 27 2022 8:59 AM

Varalakshmi Sarathkumar Wrap Up Shabri Movie Shooting - Sakshi

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. ఈ మూవీతో అనిల్‌ కాట్జ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్‌ పతాకంపై మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ కొడైకెనాల్‌లో ముగిసింది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రెండు వారాలుగా కొడైకెనాల్‌లో జరుగుతున్న ‘శబరి’ షూటింగ్‌ సోమవారంతో ముగిసింది.

చదవండి: జూ. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ‘ఆది’ రీరిలీజ్‌! ఎప్పుడంటే..

ఈ చిత్రం షూటింగ్‌ త్వరగా పూర్తి చేసి, మీ ముందుకు సినిమాని ఎప్పుడు తీసుకువద్దామా? అని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. తర్వాతి షెడ్యూల్‌ని వైజాగ్‌లో ప్రారంభిస్తాం’’ అన్నారు మహేంద్రనాథ్‌ కూండ్ల. ‘‘కూతుర్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించే తల్లిగా వరలక్ష్మి నటిస్తున్నారు’’ అన్నారు అనిల్‌ కాట్జ్‌. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement