Odela 2: నాగ సాధువుగా తమన్నా! | Tamannaah Bhatia's First Look Out From 'Odela 2' | Sakshi
Sakshi News home page

Odela 2: నాగ సాధువుగా తమన్నా!

Mar 9 2024 10:50 AM | Updated on Mar 9 2024 11:09 AM

Tamannaah Bhatia Look Out From Odela 2 - Sakshi

తమన్నా లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లపై డి. మధు నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో కనిపించారు తమన్నా.

‘‘ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అత్యధిక బడ్జెట్‌తో బహు భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కాశీలో జరుగుతోంది. శివ శక్తి పాత్ర కోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండే ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు మేకర్స్‌. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్‌. సింహ, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్‌ విహారి, సురేందర్‌ రెడ్డి, భూ΄ాల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్‌. ఎస్, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌. 

Advertisement
 
Advertisement
Advertisement