రికార్డులు క్రియేట్‌ చేసే వాళ్లు పరుగులు పెట్టరు: స్వప్న దత్‌ | Swapna Dutt Comments On Kalki 2898 AD Movie | Sakshi
Sakshi News home page

రికార్డులు క్రియేట్‌ చేసే వాళ్లు పరుగులు పెట్టరు: స్వప్న దత్‌

Jun 28 2024 3:54 PM | Updated on Jun 29 2024 2:11 PM

Swapna Dutt Comments On Kalki 2898 AD Movie

ప్రభాస్‌- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం తాజాగా విడుదలైంది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కల్కి నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్‌ తాజాగా స్పందించారు.  

'కల్కి సినిమా విడుదల తర్వాత చాలామంది నాకు కాల్‌ చేస్తున్నారు. ఇతర సినిమాలకు చెందిన రికార్డులను 'కల్కి' క్రాస్‌ చేసిందా..? అని కొందరు అభిమానులు అడుగుతున్నారు. ఈ ప్రశ్న నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటికే రికార్డులు క్రియేట్‌ చేసిన వారెవ్వరూ మళ్లీ వాటికోసమే పరుగులు పెట్టి సినిమాలు చేయరు. కల్కి చిత్రాన్ని ప్రేక్షకుల కోసం తీశాం. ఇలాంటి ప్రశ్నలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.' అని స్వప్నదత్‌ అన్నారు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన వంటి స్టార్స్‌ నటించారు.  జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదలైన కల్కి సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్‌, వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో కల్కి చిత్రం కూడా ఎవర్‌గ్రీన్‌గా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

Advertisement
 
Advertisement
Advertisement