Sridevi Soda Center Movie Release Date: ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ విడుదలకు డేట్‌ ఫిక్స్‌, ఎప్పుడంటే - Sakshi
Sakshi News home page

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ విడుదలకు డేట్‌ ఫిక్స్‌, ఎప్పుడంటే

Aug 12 2021 2:39 PM | Updated on Aug 12 2021 3:21 PM

Sri Devi Soda Center Movie Release Date Revealed - Sakshi

సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్‌ ఆ అంచనాలు మరింత పెంచాయి.

 తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. ఆగస్ట్‌ 27న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. గోదావరి జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్య సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement