SKY:ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే? | Sky Movie New Poster Out - Sakshi
Sakshi News home page

SKY:ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే?

Sep 9 2023 2:03 PM | Updated on Sep 9 2023 2:41 PM

Sky Movie New Poster Out - Sakshi

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్‌) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’. ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే" అన్నది ట్యాగ్ లైన్. పృథ్వి పేరిచర్ల దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్"పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ "స్కై" చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement