అందుకే ప్రియాభవానీ శంకర్‌తో రెండోసారి: ఎస్‌జే సూర్య | SJ Suryah Priya Bhavani Shankar Bommai Movie | Sakshi
Sakshi News home page

SJ Suryah-Priya Bhavani Shankar: ఎస్‌జే సూర్య-ప్రియాభవానీ శంకర్ రెండోసారి..!

Jun 14 2023 2:35 PM | Updated on Jun 14 2023 5:58 PM

SJ Suryah Priya Bhavani Shankar Bommai Movie - Sakshi

నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'బొమ్మై'. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రానికి రాధామోహన్‌ కథ అందించి దర్శకత్వం వహించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈనెల 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌జే సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

'దర్శకుడు రాధామోహన్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ మూవీ నిర్మించాను. అలా మొదలైన ఈ చిత్రం చాలా సంతృప్తిగా వచ్చింది. 'మాన్‌స్టర్‌'లో నాతో కలిసి యాక్ట్ చేసిన ప్రియాభవానీ శంకర్‌నే ఇందులోనూ హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారు. మా అక్క కూతురికి ఇంచుమించు ప్రియాభవాని ఛాయాలు ఉంటాయి. నటి సిమ్రాన్‌కు, త్రిషకు అలాంటి ఫేస్‌ కట్‌ ఉంటుంది. అలా ముఖంలో ఓకే కట్‌ ఉన్న ఒకరికి, మరొకరికి మధ్య సారుప్యత ఉంటుంది' 

'నటుడు షారూక్‌ ఖాన్‌కు, నటి కాజోల్‌కు అలాంటిదే ఉంది. కారణం ఏంటనేది చెప్పలేను గానీ నాకు, ప్రియాభవాని శంకర్‌కు ఒక మ్యాథమేటిక్స్‌ ఫ్యూచర్స్‌ సెట్‌ అవుతుంది. ఇది ఒక కారణం కావచ్చు. చాప్టర్‌ను మలరుమ్‌ పాటలో నేను, సిమ్రాన్‌ మాదిరిగానే ప్రియాభవాని శంకర్‌ ఉంది. ఇకపోతే ప్రియాభవాని శంకర్‌, తాను మాన్‌స్టర్‌ చిత్రంలో నటించాం. అది మంచి హిట్‌ కావడం కూడా ఇందులో మళ్లీ మేమిద్దరం కలిసి నటించడానికి కారణం అయ్యిండొచ్చు' అని ఎస్‌జే సూర్య చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: హీరో షారుక్ ఖాన్‌కి చేదు అనుభవం.. ఆమె అలా చేసేసరికి!)

Advertisement
 
Advertisement
Advertisement