దీపావళికి థియేటర్లో ‘ప్రిన్స్‌’ సందడి  | Sivakarthikeyan Prince Movie Release on Theaters This Diwali October 21,2022 | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: దీపావళికి థియేటర్లో శివకార్తికేయన్‌ ‘ప్రిన్స్‌’ మూవీ సందడి 

Oct 3 2022 11:09 AM | Updated on Oct 3 2022 11:09 AM

Sivakarthikeyan Prince Movie Release on Theaters This Diwali October 21,2022 - Sakshi

డాక్టర్, డాన్‌ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు శివకార్తికేయన్‌. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ప్రిన్స్‌. ఈ చిత్రంతో ఈయన దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్నారు. విశేషం ఏమిటి ఇంతకుముందు తన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శివకార్తికేయన్‌ ఈ చిత్రంతో నేరుగా వారి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అవును తమిళం, తెలుగు భాషలలో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని జాతి రత్నాలు చిత్రం ఫేమ్‌ అనుదీప్‌ తెరకెక్కిస్తున్నారు.

చదవండి: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ

ఈ చిత్రం ద్వారా ఉక్రెయిన్‌ దేశానికి చెందిన మరియా అనే నటి కథానాయకిగా పరిచయం అవుతోంది. నటుడు సత్యరాజ్, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని పిపిలికా పిలాయ్‌ అనే పాటలు ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా చిత్ర షూటింగ్‌ పూర్తి అయినట్లు ఆదివారం అధికారికపూర్వకంగా ప్రకటించారు. దీంతో పాటు చిత్ర పోస్టర్‌ను విడుదల చేస్తూ అక్టోబర్‌ 21,20200 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా నటుడు శివకార్తికేయన్‌ ఈ చిత్రంలో టూరిస్ట్‌ గైడ్‌గా నటిస్తున్నట్లు సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement