Siva Kona New Movie Poster Out - Sakshi
Sakshi News home page

ఆసక్తి పెంచుతున్న శివ కోన కొత్త సినిమా పోస్టర్‌

May 27 2023 3:15 PM | Updated on May 27 2023 3:31 PM

Siva Kona New Movie Poster Out - Sakshi

శివా కోన దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతుంది.  ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు కానీ పోస్టర్‌ని మాత్రం వదిలారు. ఆ పోస్టర్‌లోక్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరికి ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది.  ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరక్కబోతుందని అర్థం అవుతుంది.

కాలేజీకి వెళ్లే కుర్రాళ్ల చేతుల్లో గన్ను ఉంది. వాళ్ల పక్కనే ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు. వీరికి ముందు ఒక సూటు వేసుకున్న గ్రే షేడ్ క్యారెక్టర్, తన పక్కనే ఓ గ్లామర్ బ్యూటీ ఉంది. వీరే కాకుండా రేయ్ ఎవర్రా మీరంతా అంటే నోట్లో సిగర్ పెట్టుకుని కొని, చేతిలో కోడిని పట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్  క్యారెక్టర్ కుర్చీలో కూర్చున్న పోస్టర్ ఆలరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement