‘SSMB 29’లో నాన్న లుక్‌ అదిరిపోతుంది: సితార | Sitara Ghattamaneni Interesting Comments On SSMB29 | Sakshi
Sakshi News home page

‘SSMB 29’లో నాన్న లుక్‌ అదిరిపోతుంది: అంచనాలు పెంచేసిన సితార

Mar 30 2025 3:39 PM | Updated on Mar 30 2025 3:58 PM

Sitara Ghattamaneni Interesting Comments On SSMB29

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh babu) గారాల పట్టి సితార (Sitara) కు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి అందరికి  తెలిసిందే. సినిమాల్లోకి రాకపోయినా ఓ స్టార్‌ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్‌ ఉంది. ఆమె ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్‌ పెడితే చాలు నిమిషాల్లో వైరల్‌ అయిపోతుంది. అతి చిన్న వయసులోనే అత్యధిక ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. అయితే ఈ చిన్నారి త్వరలోనే వెండితెరపైకి రావడం ఖాయం. మహేశ్‌ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పాడు. చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వచ్చే చాన్స్‌ ఉంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్‌గా మారకముందే పలు సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటుంది. తాజాగా సీతూ పాప హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పీఎంజే 40వ స్టోర్‌ ఓపెనింగ్‌కి వెళ్లింది.  దీంతో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివెళ్లారు. 

షాపు ఒపెనింగ్‌ అనంతరం సితార మీడియాతో మాట్లాడుతూ మహేశ్‌ బాబు, రాజమౌళి సినిమా(SSMB 29) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ నాన్న లుక్‌ అదిరిపోతుంది. మీరు ఊహించుకుంటున్నదానికంటే ఎక్కుకే ఈ సినిమా ఉంటుంది. ఇంతకంటే ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను’ అని చెప్పింది. అలాగే తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పీఎంజే కోసం మరోసారి మహేశ్‌తో కలిసి యాడ్‌ చేయబోతున్నట్లు సితార వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందే  సితార ఇలా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం, షాపు ఓపెనింగ్స్ కి వెళ్లడం పట్ల ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement