‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ లో దిష్టి బొమ్మ గురించి చర్చించాం: హీరో శివ కందుకూరి | Shiva Kandukuri Talk About Bhoothaddam Bhaskar Narayana Movie | Sakshi
Sakshi News home page

Bhoothaddam Bhaskar Narayana: దిష్టి బొమ్మ గురించి తెలియని విషయాలు చెప్పాం

Feb 29 2024 4:48 PM | Updated on Feb 29 2024 4:50 PM

Shiva Kandukuri Talk About Bhoothaddam Bhaskar Narayana Movie - Sakshi

-హీరో శివ కందుకూరి

క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ తెలుగులో చాలా వచ్చాయి. డిటెక్టివ్ అనేసరికి చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి జోనర్ సినిమా చేయాలనుకున్నపుడు ఏదో యునిక్ నెస్ ఉంటే తప్పితే చేయకూడదని అనుకున్నాను. భూతద్ధం భాస్కర్ నారాయణ కథలో ఒక మైథాలజీ ఎలిమెంట్ ఉంది. మునుపెన్నడూ ఇలాంటి ఎలిమెంట్ ఏ డిటెక్టివ్ సినిమాలో లేదు. అది నాకు కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది. అందుకే సినిమా ఒప్పుకున్నాను’అన్నారు యంగ్‌ హీరో శివ కందుకూరి. ఆయన హీరోగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.  స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్‌ శివ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

దిష్టి బొమ్మ మనం చూస్తుంటాం. కానీ అసలు అది ఎందుకు ఉందనేది పెద్దగా పట్టించుకోం. దాని గురించి చాలా మందికి తెలీదు. దీని గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. దానిని ఈ కథకు చాలా అద్భుతంగా జోడించాడు దర్శకుడు. దీంతో చాలా కొత్తదనం ఉంటుంది. అలాగే ఇందులో డిటెక్టివ్ పాత్ర కూడా చాలా అభిన్నంగా డిజైన్ చేశారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిటింగ్‌గా అనిపించిందో సినిమా చూసినప్పుడు అది మరింతగా పెరిగింది. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామనే నమ్మకం ఉంది.

► దర్శకుడు పురుషోత్తం రాజ్ గారిది అనంతపురం దగ్గర ఓ విలేజ్. ఇందులో ఉన్న పాత్రలని ఆయన పల్లె జీవనంలో చూసిన పాత్రల్లా డిజైన్ చేశారు. ఈ కథ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్య ఉండే ఫారెస్ట్ టౌన్ నేపధ్యంలో జరుగుతుంది. ఇందులో డిటెక్టివ్ పాత్రని కూడా అక్కడ ఉన్న ఓ సహజసిద్దమైన పాత్రలానే డిజైన్ చేశారు. దీంతో వరల్డ్ బిల్డింగ్ లో ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది. 

► వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండే సినిమా ఇది. మేము మొదట ఎంచుకున్న వీఎఫ్ఎక్స్ టీం ఇచ్చిన అవుట్ పుట్ మాకు తృప్తిని ఇవ్వలేదు. దీంతో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మరో కంపెనీతో మొదటి నుంచి  చేయించారు. ఈ విషయంలో నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతున్నాను. సీజీ వర్క్ అద్భుతంగా వచ్చింది.

► ప్రస్తుతం  మైథాలజీకల్ థ్రిల్లర్  జోనర్స్ ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా రావడం మంచి పరిణామం అనిపిస్తోంది. బిజినెస్ పరంగా కూడా నిర్మాతలు చాలా హ్యాపీగా  ఉన్నారు. ఒక నటుడిగా ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని విడుదల చేస్తుండటం మాకు మరింత బలాన్ని ఇచ్చింది. 

► ఈ సినిమాలో నా పాత్ర పేరు భాస్కర్ నారాయణ. ఆ పాత్రకు భూతద్ధం సైజు కళ్ళద్దాలు ఉంటాయి. దీంతో అందరూ భూతద్ధం భాస్కర్ నారాయణ అని పిలుస్తుంటారు. డిటెక్టివ్ అనేసరికి భూతద్ధంని వాడుతుంటాం. టైటిల్ కి పాత్రకు రెండికి ఆ టైటిల్ యాప్ట్ గా సరిపోయింది. ఇందులో ఫన్ ఎలిమెంట్ కూడా ఉంది. అయితే కథలో భాగమైయ్యే ఉంటుంది. అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా కథలో లీనమయ్యే ఉంటుంది.  

► ఇందులో కథానాయిక పాత్రకు తెలుగమ్మాయి అయితే బావుటుందని అనుకున్నాం.  ఇలాంటి సమయంలో రాశి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. తనది తెలుగు కాకపోయినప్పటికీ తెలుగుని చాలా చక్కగా మాట్లాడగలరు. ప్రతి డైలాగ్ ని కష్టపడి నేర్చుకున్నారు. చాలా అంకితభావంతో పని చేశారు.

 శ్రీచరణ్ పాకాల అందించిన నేపధ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అద్భుతమైన సౌండ్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ ని ఇస్తుంది. అలాగే ఇందులో ఏఐ జనరేటెడ్ లిరికల్ వీడియో చేశాం. అది మా ఆర్ట్ డైరెక్టర్ ఆలోచన. యాభై పెయింటింగ్ లు స్కాన్ చేసి ఎఐ లిరికల్ వీడియో చేశాం. తెలుగు చేసిన తొలి ఎఐ లిరికల్ వీడియో కావడం ఆనందంగా ఉంది.  

► ప్రస్తుతం ప్రమోద్ అనే కొత్త దర్శకుడితో  ఓ సినిమా చేస్తున్నాను. ఓల్డ్ సిటీ నేపధ్యంలో జరిగే కథ అది. వినోదంతో పాటు మంచి భావోద్వేగాలు కూడా ఉంటాయి. మార్చి 4 నుంచి షూట్ కి వెళ్తున్నాం. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement