అది నా అదృష్టం | Shankar Dada MBBS Re Release On 4th November In Theatre | Sakshi
Sakshi News home page

అది నా అదృష్టం

Oct 28 2023 1:32 AM | Updated on Oct 28 2023 1:32 AM

Shankar Dada MBBS Re Release On 4th November In Theatre - Sakshi

శ్రీకాంత్‌

చిరంజీవి హీరోగా, శ్రీకాంత్‌ కీలక పాత్రలో జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన హిట్‌ ఫిల్మ్‌ ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’. ఈ సినిమా నవంబరు 4న థియేటర్స్‌లో రీ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో నాగబాబు, శ్రీకాంత్‌ రీ రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

అనంతరం శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘హిందీ చిత్రం ‘మున్నాభాయ్‌ ఏంబీబీఎస్‌’ తెలుగు రీమేక్‌ గురించి వినగానే, హీరో పక్కన ఉండే పాత్ర నాకే రావాలనుకున్నాను. అలాగే వచ్చింది. ఇప్పటికీ నన్ను ‘ఏటీఎం’ (శ్రీకాంత్‌ పాత్ర పేరు) అని పిలుస్తుంటారు. అన్నయ్య (చిరంజీవి)తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement