గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్‌ హీరోయిన్‌ | Senior Actress Meena Receives UAE Golden Visa | Sakshi
Sakshi News home page

Meena: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్‌ హీరోయిన్‌

Mar 9 2022 2:25 PM | Updated on Mar 9 2022 6:04 PM

Senior Actress Meena Receives UAE Golden Visa - Sakshi

Senior Actress Meena Receives UAE Golden Visa: ఈ మధ్య కాలంలో సినీ చిత్ర పరిశ‍్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఇచ్చే గోల్డెన్‌ వీసాలను అందుకుంటున్నారు. 2019 నుంచి ఈ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్‌ అవుతుంది. ఈ అరుదైన గౌరవాన్ని తాజాగా సీనియర్‌ హీరోయిన్‌, నటి మీనాకు దక్కింది. ఈ వీసాను స్వీకరించిన మీనా దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్‌ఫోలో పాల్గొన్నారు. తనకు గోల్డెన్‌ వీసాను యూఏఈ ప్రదానం చేయడం పట్ల మీనా సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే అరబ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవలే కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్‌ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్‌లో సంజయ్ దత్, సునీల్‌ శెట్టి, సింగర్స్‌ సోనూ నిగమ్‌, నెహా కక్కర్‌, బుల్లితెర హాట్‌ బ్యూటీ మౌనీ రాయ్‌, ఫరా ఖాన్‌, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్‌ కుటుంబం ఈ వీసా పొందింది. ఈ వీసాను సాధించిన హీరోయిన్‌ త్రిష.. తొలి తమిళ కథానాయికగా అవతరించింది. తర్వాత అమలా పాల్‌ను కూడా గోల్డెన్‌ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్‌ లాల్‌ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్‌, దుల్కర్‌  సల్మాన్‌ కూడా ఈ వీసాను పొందారు. 

Advertisement
 
Advertisement
Advertisement